ముగిసిన under 12 క్రికెట్ పోటీలు
కదిరి మండల క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఇటీవల under 12 సెలెక్షన్స్ నిర్వహించి వాటి నుండి క్రీడాకారులను రెండు జట్లు గా చేసి నిర్వహించిన మ్యాచ్ లు ఈరోజుతో ముగిసాయి.
ఈరోజు జరిగిన రెండవ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన కదిరి టైటాన్స్ జట్టు 25 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేశారు. అఖిల్ 55, నిర్వీజ్ఞ 32,సన్నీ 26 పరుగులు చేశారు. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన కదిరి లయన్స్ జట్టు 22 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యం అందుకున్నారు. విక్రమ్ 70 ఆఫ్రాజ్ 30 శివాజీ 30 నాట్ అవుట్ రాణించారు. షారుఖ్ 3 ఆహిల్ 2 వికెట్లు తీశారు.
ఈ మ్యాచ్ లను ఎమ్ ఈ ఓ వేమనారాయణ గారు టాస్ వేసి ప్రారంభించగా, ముగింపు కార్యక్రమానికి STSN డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మేడం స్మిత గారు విచ్చేసి క్రీడాకారులకు క్రమశిక్షణ, కఠోర సాధన గురుంచి తెలియచేసారు. అలాగే కదిరి నుండి క్రికెట్ లో జాతీయ స్థాయి under 15 పోటీలలో పాల్గొని రాణించిన తేజేశ్వని ని అభినందించి బ్యాటింగ్ gloves ను బహుమతిగా అందించారు…
ఈ కార్యక్రమం లో కదిరి మండల క్రికెట్ సంఘం సభ్యులు ఎల్లప్ప, విజయ్ ముబారక్, ప్లేయర్స్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు మరియు కోచ్ నజీర్ పాల్గొన్నారు..
ధన్యవాదములు
కదిరి మండల క్రికెట్ సంఘం..

