.. గణతంత్ర దినోత్సవ సందర్భంగా… దేశ ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కరికి ఏపీ మెప్మా సంస్థ ద్వారా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఏపీ మెప్మా కార్యాలయం నందు జాతీయ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏపీ మెప్మా వ్యవస్థాపక అధ్యక్షులు హాజి ఖాదర్ బాషా మాట్లాడుతూ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని ఏ విధంగా పాలించాలి అభివృద్ధి పథంలో ఏ విధంగా తీసుకొని వెళ్ళాలి అని తలంచి మన పెద్దలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన ఒక ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసుకొని వివిధ దేశాల పాలన పద్ధతులను తెలుసుకొని అదేవిధంగా మన దేశానికి అవసరమైన పద్ధతులను ఏర్పాటు చేసుకొని ఒక గ్రంథాన్ని రచించడం జరిగింది ఆ గ్రంథమే మన రాజ్యాంగం మన రాజ్యాంగాన్ని 1950 జనవరి 26 తేదీ నుండి అమలు చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి భారతీయుడు తమ దేశం అభివృద్ధికి సంక్షేమానికి పాటుపడాలని కోరారు ప్రస్తుత పరిస్థి దేశంలో విభజించు పాలించు వంటి పద్ధతులు పాటిస్తున్నారు తద్వారా దేశం లో శాంతియుత వాతావరణం తగ్గుముఖం పట్టింది దీని ద్వారా అభివృద్ధి శూన్యం.విదేశీయులు పెట్టుబడులు పెట్టడానికి శాంతియుత అభివృద్ధి చెందుతున్న దేశం వైపే మొగ్గుచూపుతారు .ప్రపంచంలో భారతీయుడు అంటే ప్రేమాభిమానం శాంతియుత వ్యక్తులని పేరు ఉంది దానిని నిలబెట్టుకోవాలి విదేశీ వ్యవస్థ అభివృద్ధి చేసుకోవాలి అని తెలిపారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అమీర్ . ఇనాయతుల్లా జాఫర్ .అస్లాం సాదిక్ భాయ్.అజీజ్ .ఫిరోజ్.
చంద్ర.అబ్బాస్ ఇమ్రాన్ ఇర్ఫాన్ సాదిక్ అర్బాజ్ బాబా
సయ్యద్ భాష తదితరులు పాల్గొన్నారు

