AP

ఫ్రెండ్స్ ట్రస్టు ద్వారా పేద ప్రజలకు నిత్యవసర సరుకులు పంపిణీ

తలుపుల మండలంలోని కొవ్వూరి వాండ్లపల్లి, నిగిడి గ్రామాలలో ఒకరు ఆకలి కోసం ఇంకొకరు వైద్యం కోసం బాధపడుతున్నారని గ్రహించి రూలర్ డెవలప్మెంట్ ఫ్రెండ్స్ ట్రస్ట్ ద్వారా వారికి నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది.1 .ఈదులకుంట్లపల్లి పంచాయితీ కొవ్వూరి వాండ్లపల్లి గ్రామంలో నందిని 19 సంవత్సరాలు తన చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించడం జరిగింది. నందిని కి కూడా తెలియని వ్యాధితో బాధపడుతూ మంచానికి పరిమితమైంది. ఆహారము గాని మరియు నీళ్లు గాని మంచంలోనే ఉండి ప్రతిరోజు బాధపడుతూ జీవితాన్ని గడుపుతుంది. నందిని కి ఫ్రెండ్స్ ట్రస్ట్ చైర్ పర్సన్ మన్సూర్ గారు ఈరోజు ట్రస్టు ద్వారా ధైర్యం చెబుతూ నిత్యవసర సరుకులు కూడా ఇచ్చి భవిష్యత్తులో కూడా తోడుగా ఉంటామని తెలియజేయడం జరిగింది 2. తలుపుల పంచాయితీ నిగిడి గ్రామంలో కాంతమ్మ గారు పేదరికంలో జన్మించి కూలి పని చేసుకుంటూ జీవితం గడుపుతుండగా వారికి ప్రస్తుతం క్యాన్సర్ వ్యాధి రావడంతో ప్రతిరోజు కూడా మందులు కూడా ఇబ్బంది పడుతున్నారని గ్రహించిన ఫ్రెండ్స్ ట్రస్ట్ వారి కుటుంబానికి ధైర్యం చెప్పి నిత్యవసర సరుకులు సహాయం కూడా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు బావాజీ పాల్గొనడం జరిగింది.