AP

కదిరిలో జనసేన ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీల సదస్సు: సమస్యల పరిష్కారానికి భైరవ ప్రసాద్ భరోసా

ముస్లిం మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేస్తాం.. వారికి అండగా ఉంటాం..భైరవ ప్రసాద్
ఈ రోజు కదిరి జనసేనపార్టీ కార్యాలయంలో ఇన్చార్జి భైరవ ప్రసాద్ ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పలువురు పింఛన్లు, ఇళ్ల పట్టాలు, రేషన్ కార్డులు, స్థానికంగా నీటి సమస్యల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భైరవ ప్రసాద్ మాట్లాడుతూ మీకూ పార్టీ అండగా ఉంటుంది అని, మీ సమస్యలను నేనూ, మా పార్టీ నాయకులు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని,అలాగే కూటమి ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముస్లిం మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేస్తారనీ, అలాగే గతంలో 2019 లో జరిగిన సాధారణ ఎన్నికల్లో 3 ఎంపీ సీట్లు ఇచ్చిన ఘనత ఒక్క జనసేనపార్టీ కే చెందుతుందని, మా పార్టీ మూల సిద్దంతాల్లోనే మతాలను గౌరవించే విధానం ఉందని కాబట్టి ఈ మంచి ప్రభుత్వానికి మీ అండదండలు అందించాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు చలపతి, నల్లచెరువు మండల కన్వీనర్ సాకే రవికుమార్ ,చిన్నపరెడ్డి ,ఇర్ఫాన్ ,ఫయాజ్ ,రాజేంద్రప్రసాద్ ,గంగరాజు, గులాం అహమ్మద్,షకీన, షబానా, దిల్షాద్, మున్ని, షాహిన, షమీం ,రెహనా ,బేగంబి ,మెహతా, పరహణ, ఆయేషా, సాహిక్ ,నజీమా ,నసీమా, తదితరులు పాల్గొన్నారు.