AP

కదిరిలో ఆధ్యాత్మిక వెల్లువ: స్వాతి నక్షత్రం సందర్భంగా స్తోత్రాద్రి గిరిప్రదక్షిణలో పోటెత్తిన భక్తులు

శ్రీ వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా స్తోత్రాద్రి గిరిప్రదక్షిణలో పెద్దయెత్తున పాల్గొన్న భక్తులు.

సనాతన ధర్మంలో ప్రకృతిని , పంచభూతాలను ఆరాధించడం మన హిందూ సాంప్రదాయం అందులో భాగంగానే ప్రతి పుణ్య క్షేత్రాలలో గిరి ప్రదక్షిణ అంత ప్రాధాన్యత సంతరించుకుంది.అందులో భాగంగానే శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలో స్వయంభువుగా ప్రహ్లాద సమేతంగా వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయానికి కుమ్మర వాండ్ల పల్లి గ్రామంలో కొండల లక్ష్మీ నారసింహుడుగా స్తోత్రాద్రిపై ( కదిరి కొండ ) వెలసిన కారణంగా ప్రతి నెలా శ్రీ వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా శ్రీ వారి భక్తులు పెద్దయెత్తున గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నారు.ఈ మధ్య కాలంలో సోషియల్ మీడియా కొద్ది మంది ఆకతాయిలు ఈ కదిరి కొండ ప్రాంతంలో పులులు సంచరిస్తున్నాయని భయబ్రాంతులకు గురి చేసినప్పటికీ భగవంతునిపై భక్తి సంకల్పం ముందు అవన్నీ అడ్డురావని ఈరోజు పెద్ద సంఖ్యలో శ్రీ వారి గోవింద నామస్మరణతో , హరి కీర్తనలతో శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహుడిపై భక్తితో గిరిప్రదక్షిణ పూర్తి చెయ్యడం జరిగింది.శ్రీ వారి భక్తులకు మనోధైర్యాన్ని కల్పించే విధంగా కదిరి రూరల్ C.I నిరంజన్ రెడ్డి గారు , ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గుర్రప్ప గారు ,శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసులు రెడ్డి గారు వారి సిబ్బందితో శ్రీ వారి గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నిత్యం కదిరి కొండ చుట్టూ పర్యవేక్షించడం జరిగింది.కొండల లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం వద్ద శ్రీ వారి భక్తులకు శ్రీ కుర్లి నరసింహ రెడ్డి మరియు శ్రీ నరసమ్మ వారి కుటుంబ సభ్యులు మహా ప్రసాదం ఏర్పాటు మరియు శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి సభ్యులు భక్తులకు మంచినీరు , మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు.శ్రీ వారి గిరి ప్రదక్షిణ ప్రారంభించి ఒక సంవత్సరం కాలం గడుస్తోంది కావున కదిరి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణకు అనుకూలంగా రహదారి మార్గాన్ని ఏర్పాటు చేస్తే వృద్ధులకు , పిల్లలకు సౌలభ్యంగా ఉంటుందని శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి తరపున ప్రజా ప్రతినిధులకు , ప్రభుత్వ అధికారులకు , ఆలయ అధికారులకు హిందూ ధార్మిక సంస్థలు మరియు శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి తరపున భక్తులు కోరుకుంటున్నారు.