శ్రీ సత్య సాయి జిల్లా
కదిరి టౌన్ నందు రౌడీ షీటర్ పై PD Act నమోదు, కడప సెంట్రల్ జైల్ కు తరలింపు…
కదిరి టౌన్, పూల బజారులో నివాసము ఉంటున్న బంగారు బాల మురళి క్రిష్ణ @ బాలు, వయస్సు 24 సంవత్సరాలు, తండ్రి: బి సురేశ్ ఆచారి అను వ్యక్తి కదిరి టౌన్ మరియు కదిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలలో ఈ క్రింద తెలిపిన నేరాలలో పాల్గొనడము జరిగింది. అవి
1. Kadiri town Ps,Cr.No.85/2020 U/s 160 IPC
2. Kadiri town Ps, Cr.No.514/2020 U/s 160 IPC
3. Kadiri town PS, Cr.No.263/2022 U/s 324 r/w 34 IPC
4. Kadiri town PS, Cr.No.17/2023 U/s 323, 506, 354, 384 r/w 34 IPC
5. Kadiri town PS, Cr.No.13/2024 U/s 307, 324, 506 r/w 34 IPC
6. Kadiri town P.S, Cr.No.324/2024 U/s 109 of BNS.
7. Kadiri Rural UG/PS, Cr.No.41/2025 U/s 109(1),118(1) r/w 3(5) BNS
8. Kadiri town PS, Cr No. 11/2026, U/sec. 7(a) r/w 8 (e ) of A.P. Prohibition Act-1995
పైన తెలిపిన బంగారు బాల మురళి క్రిష్ణ @ బాలు పైన నేరాలలో పోలీస్ లు అతనిని అరెస్ట్ చేసి జైలుకు పంపడము జరిగింది. అయినా కూడా అతను జైలు నుండి బెయిలుపై బయటికి వచ్చి కదిరి టౌన్ మరియు కదిరి రూరల్ పోలీస్ స్టేషన్ లలో అలవాటుగా తీవ్ర నేరాలకు పాల్పడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నందున కదిరి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అతనిపై 2024వ సంవత్సరములో రౌడీ షీట్ ఓపెన్ చేసి అతని పై పోలీసుల నిఘా ఉంచడం అయినది.
అంతే కాకుండా అతని సత్ప్రవర్తన నిమిత్తము ఏప్రిల్ 2024 వ తేదీ న కదిరి మండల తహశీల్దార్ వారి వద్ద ఒక సంవత్సర కాలనికి మరియు ఒక లక్ష రూపాయలకు బైండ్ ఓవర్ చేపించడం జరిగింది.
అయినా కూడా బంగారు బాలమురళి క్రిష్ణ @ బాలు నేరాలకు పాల్పడడం అలువాటుగా చేసుకొని కదిరిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ఉండడంతో శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పి గారి ఆదేశాల మేరకు అతనిపై PD Act ఆదేశాలు ఇవ్వమని గౌరవ శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ గారెకి నివేదిక పంపగా, కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు ఈ రోజు సదరు రౌడీ షీటర్ బంగారు బాలమురళి క్రిష్ణ @ బాలు ను కడప సెంట్రల్ జైల్ కు తరలించడం జరిగింది.
గతములో కూడా కదిరిలో తీవ్ర నేరాలకు పాల్పడి కదిరిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న షేక్ అబూ బకర్, మరియు కోలేపల్లి అంజాద్ ఖాన్ @ మెగా అంజాద్ అను వారి పై కూడా PD Act మీద జైలుకు పంపడం జరిగింది.
అంతే కాకుండా కదిరి సబ్ డివిజన్ పరిధిలో అలవాటుగా తీవ్ర మైన నేరాలకు పాల్పడే వారిని ఇప్పటికే పోలీస్ లు గుర్తించి వారిపై రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరిగింది. వారిపై కూడా శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పి గారి ఆదేశాల మేరకు PD Act నివేదికను గౌరవ కలెక్టర్ వారికి పంపడం జరుగుతుంది.
జె. శివ నారాయణ స్వామి,
కదిరి సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్

