పొత్తులు ప్రకటించారు పవన్. టీడీపీ కూడా సమన్వయంతో కలిసి పని చేస్తామని ప్రకటించారు. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. పార్టీ విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో పార్టీ క్యాడర్ కు పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేయనున్నారు. ఎవరికైనా పొత్తులపై అభ్యంతరాలు ఉంటే.. తమ దారి తాము చూసుకోవచ్చని గతంలోనే చెప్పారు. తన నిర్ణయమే ఫైనల్ అని. తేల్చేశారు. ఇప్పుడు మరోసారి అదే సందేశం పంపే అవకాశం ఉంది. జగన్ రెడ్డి . వందల కోట్లు ఖర్చు పెట్టి సోషల్ మీడియాలో చిచ్చు పెడతారని.. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్లంతా అలాంటి కోవర్టులేనని జనసేన అభిప్రాయం.
మరో వైపు సీట్ల గురించి ఎవరూ మాట్లాడవద్దని.. పార్టీకి ఎక్కడ బలం ఉందో అక్కడ ఖచ్చితంగా జనసేన పోటీ చేస్తుందని.. ఈ విషయంలో బయట లేనిపోని చర్చలు పెడితే ఊరుకునేది లేదని పార్టీ నేతలకు హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. సీట్ల సర్దుబాటు అంశం తాము చూసుకుంటామని చెప్పే అవకాశం ఉంది. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన అంశం. ప్రభుత్వంపై పోరాటం. ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. నిర్బంధాలు ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రజా ఉద్యమం బలంగా లేపడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీతో కలిసి ఓ తిరుగుబాటును ప్రజ్లలోకి తీసుకు వచ్చి ప్రభుత్వంపై విప్లవం మాదిరిగా పోరాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇందు కోసం టీడీపీతో కలిసి సమన్వయంతో కలిసి పని చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా పవన్ పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.