CINEMA

ప్రేమా? సినిమాలా..తేల్చుకోలేకపోయా.. మంచు మనోజ్

మంచు మనోజ్( Manchu Manoj) ఇటీవలే భూమా మౌనిక రెడ్డి ( Bhuma Mounika Reddy) తో కలిసి వివాహ బంధంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే.

పెళ్లయిన తర్వాత తొలిసారిగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ జంట పాల్గొంది. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలై ఆకట్టుకుంటుంది. మనోజ్ పరిచయం ప్రేమగా ఎలా మారిందో చెప్తూ మౌనిక ఉద్వేగానికి లోనైంది. తన తల్లి భూమా శోభా రెడ్డి చనిపోయిన తొలినాళ్లలో మనోజ్ తనకు అండగా ఉన్నట్లు తెలిపింది.

ప్రేమను గెలిపించుకోవడానికి సినిమా కష్టాలు ఎదుర్కొన్నట్టు మనోజ్ చెప్పాడు. అంతేకాకుండా తనకు ప్రేమో,సినిమాలో? తేల్చుకోవాల్సిన పరిస్థితి ఎదురైనప్పుడు తాను మౌనిక వైపే నిలబడినట్లు తెలిపాడు.

ఇటీవల మంచు ఫ్యామిలీలో విభేదాలు తలెత్తుతున్న విషయం తెలిసిందే. అన్నదమ్ముల మధ్య గొడవలపై మంచు కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ప్రతి ఇంట్లో గొడవలు సహజమేనని మంచు మోహన్ బాబు( Mohan Babu) వ్యాఖ్యానించగా. ‘బలగం’ సినిమాలో అన్నదమ్ములు కలిసిపోయే సన్నివేశాన్ని గుర్తు చేస్తూ ఇటీవలే మంచు లక్ష్మి ( Manchu Lakshmi) సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఇంటర్వ్యూలో మనోజ్ ఈ వివాదం పై స్పష్టతనిస్తారేమోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు.