APCINEMATELANGANA

హైదరాబాద్ నుంచి విజయవాడకు గంటన్నరలో, తిరుపతికి 3 గంటల్లో…

1. ప్రస్తుతం వందే భారత్ రైళ్లు (Vande Bharat Trains) గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి.

భోపాల్-ఢిల్లీ రూట్‌లో తాజాగా లాంఛ్ అయిన వందే భారత్ ట్రైన్ గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న మొదటి రైలు కావడం విశేషం. రాబోయే రోజుల్లో ఇంతకన్నా వేగంతో రైళ్లు పరుగులు తీయబోతున్నాయి. (image: Indian Railways)

2. భారతీయ రైల్వే హైస్పీడ్ టెస్ట్ ట్రాక్‌ను నిర్మిస్తోంది. హైస్పీడ్ రైళ్లను పరీక్షించేందుకు ప్రత్యేకంగా ట్రాక్ రూపొందిస్తోంది. ఈ ట్రాక్‌పై వందే భారత్ రైళ్లను గంటకు 220 కిలోమీటర్ల వేగంతో నడపనుంది భారతీయ రైల్వే. ఈ ట్రాక్‌పై గంటకు 220 కిలోమీటర్ల వేగంతో విజయవంతంగా రైళ్లు నడిపిన తర్వాత, ఇలాంటి ట్రాక్స్ దేశవ్యాప్తంగా పలు రూట్లల్లో నిర్మించనుంది రైల్వే. (image: Indian Railways)

3. గంటకు 220 కిలోమీటర్లు అంటే మామూలు వేగం కాదు. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి విజయవాడకు సుమారు 275 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ దూరాన్ని హైస్పీడ్ రైలు కేవలం గంటన్నరలోపే కవర్ చేస్తుంది. ఇక హైదరాబాద్ నుంచి తిరుపతికి సుమారు 560 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ దూరాన్ని హైస్పీడ్ రైలు కేవలం 3 గంటల్లో కవర్ చేస్తుంది. (image: Indian Railways)

4. గత తొమ్మిదేళ్లలో ప్రధాని మోదీ అనేక రంగాలను ఎగుమతుల హబ్‌గా మార్చారని, రక్షణ, ఐటీ, ఎలక్ట్రానిక్స్ ఇలా అన్ని రంగాల్లో నేడు భారతదేశం పెద్ద ఎగుమతిదారుగా ఎదిగిందని, భారతదేశం రైల్వేలకు పెద్ద ఎగుమతిదారుగా ఎదగాలంటే టెస్టింగ్ ట్రాక్‌ల అభివృద్ధి చాలా ముఖ్యమని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. (image: Indian Railways)

5. టెస్ట్ ట్రాక్ అనేక సౌకర్యాలను కలిగి ఉంటుందని, ఇందులో రైలు, సిగ్నలింగ్ వ్యవస్థ వేర్వేరు పారామీటర్స్‌లో పరీక్షించబడతాయని, టెస్ట్ ట్రాక్ పనులు శరవేగంగా సాగుతున్నాయని, ఈ రోజు వందే భారత్ గురించి చాలా చర్చ జరుగుతోందని, రాబోయే కాలంలో భారతదేశం వందే భారత్ రైళ్ల ఎగుమతిదారుగా మారుతుందని, ఇందుకోసం టెస్ట్ ట్రాక్‌పై అన్ని పరీక్షలు జరగాలని అన్నారు. (image: Indian Railways)

6. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ డివిజన్‌లో, జైపూర్‌కి దాదాపు 70 కి.మీ దూరంలో గుఢా-థాటనామిత్ర మధ్య 59 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తూ బీజీ డెడికేటెడ్ టెస్ట్ ట్రాక్ నిర్మిస్తోంది భారతీయ రైల్వే. ఇందులో మెయిన్ లైన్, హైస్పీడ్ లూప్, యాక్సెలరేటెడ్ టెస్టింగ్ లూప్, కర్వ్ టెస్టింగ్ లూప్ ఉంటాయి. (image: Indi