ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది. దాదాపు 10 గంటలకు పైగా సాగిన విచారణలో కీలక ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. అయితే, తాను ఫోన్లను ధ్వంసం చేసినట్లు ప్రచారం జరిగిన నేపథ్యంలో సదరు ఫోన్లు ఇవే అంటూ ఉదయం మీడియాకు ప్రదర్శించారు ఎమ్మెల్సీ కవిత. అనంతరం వాటిని దర్యాప్తు అధికారులకు అప్పగించారు. కాగా, ఇవాళ రాత్రి వరకు విచారణ జరగడంతో క్షణం క్షణం ఎంతో ఉత్కంఠ నెలకొంది. అయితే, మళ్లీ ఎప్పుడు రావాలి అనే విషయాన్ని ఈడీ చెప్పలేదు. ఇదే అంశంపై కవిత ప్రశ్నించగా.. తరువాత చెప్తామని ఈడీ అధికారులు బదులిచ్చినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం బుధవారం కవిత విచారణ లేనట్లేనని స్పష్టం అవుతోంది.