TELANGANA

పొలిటికల్‌ హీట్‌ని పెంచుతున్న టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ. ఎంపీ బండి సంజయ్ కి సీట్ నోటీసులు…

టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ ఇష్యూ తెలంగాణలో పొలిటికల్‌ హీట్‌ని పెంచుతోంది. ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్న రాజకీయ నేతలకు సిట్‌ నోటీసులు కాక రేపుతున్నాయి. టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీపై సిట్ దూకుడు పెంచింది. లీకేజీ వ్యవహారంలో సిట్‌ దర్యాప్తుని ముమ్మరం చేసింది. ఓ వైపు నిందితుల వేట కొనసాగిస్తూనే.. రాజకీయనేతలకు నోటీసులు జారీచేస్తోంది సిట్‌. ప్రశ్నాపత్రాల లీకేజీపై ఆరోపణలు గుప్పిస్తున్న రాజకీయ పార్టీల నేతలకు సిట్‌ నోటీసులు కలకలం రేపుతున్నాయి.

 

నిన్న రేవంత్‌ రెడ్డికి నోటీసులు జారీచేసిన సిట్‌.. ఈ రోజు బండి సంజయ్‌కి నోటీసులు ఇచ్చింది. రేవంత్‌ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఇంటి గోడకు నోటీసులు అతికించి వచ్చారు సిట్‌ అధికారులు. రేవంత్‌ రెడ్డిని ఈనెల 24 న సిట్‌ కార్యాలయంలో హాజరుకావాలని ఆదేశించారు. ఈ రోజు బండిసంజయ్‌ని సైతం ఈనెల 24న విచారణకు రావాలని సిట్‌ ఆదేశాలు జారీచేసింది.

 

పేపర్‌ లీక్‌ ఇష్యూలో ఇటీవల బండి సంజయ్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. లీకేజ్‌ వ్యవహారంలో కేటీఆర్‌ హస్తముందంటూ విమర్శలు చేశారు బండి సంజయ్‌. బండి సంజయ్‌ ఆరోపణల్ని తీవ్రంగా పరిగణించిన సిట్‌ అందుకు ఆధారాలు చూపాలంటూ నోటీసులు జారీచేసింది. నోటీసులు ఇచ్చేందుకు బండి సంజయ్‌ ఇంటికి వెళ్ళారు సిట్‌ అధికారులు.