CINEMA

‘పుష్పరాజ్ నీ అవ్వ తగ్గేదేలే ‘ డైలాగ్ ను ఎక్కడి నుంచి రాసుకున్నారో చెప్పేసిన సుకుమార్ .

ఇండస్ట్రీలో ‘ పుష్ప ‘ సినిమా ఎటువంటి క్రేజ్ సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టును అందుకుంది.

ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు ఎంత గుర్తింపు వచ్చిందో ఆ సినిమాలోని పాటలకుర డైలాగులకు అంతకన్నా గుర్తింపు వచ్చింది. ఇక ఈ సినిమాను దర్శకత్వం వహించిన సుకుమార్ పుష్ప సినిమాలో డైలాగ్స్ ఎలా రాసుకున్నారో చెప్పుకొచ్చారు. ‘ పుష్ప.. పుష్ప రాజ్.. నీ అవ్వ తగ్గేదేలే ‘ డైలాగ్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలుసు.

ఇప్పటికీ ఈ డైలాగును సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల దాకా అందరూ వాడుతున్నారు. అయితే సుకుమార్ అల్లు అర్జున్ తో సినిమా చేయాలి అనుకున్నప్పటినుంచి మంచి స్టోరీ ఇప్పటివరకు తెరపై చూడని రియాలిస్టిక్ గా ఉండే స్టోరీని చూపించాలనుకున్నారట. ఈ క్రమంలోనే పుష్ప స్టోరీని రెడీ చేశారు. అయితే కథ రాసుకుంటున్న టైంలో సుకుమార్ పలు ప్రదేశాలు తిరిగి మరి సినిమాలో డైలాగ్స్ రాసుకున్నారట. ఈ క్రమంలోనే ఆయన చిత్తూరు కి వెళ్లారట. అక్కడ ఓ అరుగుపై కూర్చొని కథ రాసుకుంటున్న టైంలో అక్కడ ఒక పెద్ద గొడవ జరిగింది.

సాధారణంగా గొడవ పడుతున్నప్పుడు బూతు మాటలు మాట్లాడుకుంటుంటారు. ఈ క్రమంలోనే ఇద్దరు గొడవ పడుతూ బూతు మాటలతో తిట్టుకుంటున్నారట. ఆ టైంలోనే నీ అవ్వ ..అంటూ నేను తగ్గను నువ్వే పో అంటూ రకరకాలుగా వాళ్ళు మాట్లాడుకున్నారట. ఈ క్రమంలోనే సుకుమార్ ఆ డైలాగ్స్ ని తన సినిమాలో వాడేలా ముందు పుష్ప రాజ్ పేరును యాడ్ చేసి ఆ డైలాగ్స్ క్రియేట్ చేశారు. వాళ్ళిద్దరు గొడవ పడడంతో పుష్ప సినిమాలో డైలాగ్స్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. సుకుమార్ క్రియేటివిటీ మామూలుగా లేదు అంటూ జనాలు పొగిడేస్తున్నారు. మరీ డైరెక్టర్ కి ఉండాల్సిన లక్షణం ఇదే కదా.