CINEMA

మానవరాలి వయసున్న హీరోయిన్ ని మూడో పెళ్లి చేసుకోబోతున్న అమీర్ ఖాన్..!!

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరు తెచ్చుకున్న అమీర్ ఖాన్ ఆరు పదుల వయసుకు దగ్గర పడుతున్నారు. ఆరు పదుల వయసుకు దగ్గర పడుతున్న వేళ ముచ్చటగా మూడో పెళ్లికి సిద్ధమయ్యాడు అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలు చాలా రోజుల నుండి వినిపిస్తున్నప్పటికీ ఈ మధ్యకాలంలో బాలీవుడ్, టాలీవుడ్ సినీ సెలెబ్రెటీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసే దుబాయ్ సెన్సార్ బోర్డు మెంబర్ సినీ క్రిటిక్ ఉమైర్ సందు మనవరాలు వయసు ఉన్న హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ సంచలన ట్వీట్ చేశాడు.

ఇక అమీర్ ఖాన్ (Aamir Khan) బాలీవుడ్ ఇండస్ట్రీలో మిస్టర్ పర్ఫెక్ట్ అనే బిరుదు తెచ్చుకున్నప్పటికీ వైవాహిక జీవితంలో మాత్రం ఆయన ఇప్పటికీ ఎన్నో కాంట్రవర్సీలను ఎదుర్కొన్నాడు. అమీర్ ఖాన్ మొదట రీనా దత్త అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత కిరణ్ రావు అనే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకొని ఆమెకి కూడా విడాకులు ఇచ్చాడు.అయితే గత కొద్ది రోజులుగా దంగల్ సినిమాలో అమీర్ ఖాన్ పెద్ద కూతురుగా నటించిన హీరోయిన్ ఫాతిమా సనా షేక్ (Fathima sana shek) ని అమీర్ ఖాన్ మూడో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వినిపించాయి.

అయితే ఈ వార్తలు గతంలో నుండి వినిపిస్తున్నప్పటికీ ఇందులో అమీర్ ఖాన్ (Aamir Khan) ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. ఇక వీళ్ళిద్దరూ పబ్బులు,పార్టీలు, డిన్నర్లు,డేటింగ్ లు అంటూ చెట్టాపట్టాలేసుకొని తిరగడంతో మీడియా కంట కూడా చాలా సార్లు పడ్డారు. ఇక అప్పట్లో చాలామంది మనవరాలు వయసున్న అమ్మాయిని మూడో పెళ్లి చేసుకుంటావా అంటూ నెటిజన్స్ కూడా విమర్శించారు. ఇక తాజాగా ఉమైర్ సందు (Umair sandhu) చేసిన సంచలన ట్వీట్ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది.

అయితే ఈ ట్వీట్ పై అమీర్ ఖాన్ (Aamir Khan) స్పందించక పోయినప్పటికీ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ మాత్రం తనకి ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు ఇలా లేనిపోని వార్తలు రాయడం సరి కాదని స్పందించింది.అయితే వీరి మధ్య ఎఫైర్ వార్తలు వినిపించడానికి ప్రధాన కారణం అమీర్ ఖాన్ తనతో సినిమాలో నటించిన తర్వాత కూడా ముంబై వెళ్లినప్పుడల్లా ఫాతిమా అమీర్ ఖాన్ ఇంటికి వెళ్లడం వల్ల ఇది చూసిన ఇండస్ట్రీ జనాలు వీరిద్దరి మధ్య నిజంగానే ఏదో నడుస్తుంది అని మాట్లాడుకుంటున్నారు.