CINEMA

పెళ్లి చేసుకోబోతున్న ఇద్దరు స్టార్ హీరోలు..ఎవరంటే..!!

సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు ఇప్పటికే పెళ్లిళ్లు చేసుకొని సెటిల్ అయ్యారు. అలాగే బ్యాచిలర్స్ గా ఉన్న హీరోలు నితిన్, నిఖిల్, నాగశౌర్య, రానా వంటి హీరోలు కూడా పెళ్లి చేసుకోని ఓ ఇంటి వారయ్యారు. కానీ నాలుగు పదుల వయసు దాటిన ప్రభాస్ మాత్రం ఇంకా పెళ్లి ఊసే ఎత్తడం లేదు. అయితే ఈ ఏడాది చివరి లోపు ఈ ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరో (Tollywood heroes) పెళ్లిళ్లు జరుగుతాయని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఆ ఇద్దరు టాలీవుడ్ హీరోలు ( Tollywood heroes) ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.శర్వానంద్.. ఈ యంగ్ హీరో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు అంటూ ఇప్పటికే ఎన్నో వార్తలు వినిపించాయి. అంతేకాదు ఈ నెల చివర్లో ఎంగేజ్మెంట్ అలాగే వచ్చే నెలలో పెళ్లి అంటూ కొన్ని వార్తలు వినిపించాయి. అంతేకాకుండా శర్వానంద్ (Sharwanand) చేసుకోబోయే అమ్మాయి ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు మనవరాలు అని అలాగే ఆమె అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని కొన్ని వార్తలు వినిపించాయి.

అయితే ఈ విషయంలో శర్వానంద్ ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. ఇక తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. శర్వానంద్ ఈ ఏడాదిలో కచ్చితంగా పెళ్లి చేసుకోబోతున్నారట. ఇక మరొక హీరో ప్రభాస్.. ఈ హీరో కూడా ఈ ఏడాది చివరిలోపు తన చేతిలో ఉన్న ప్రాజెక్టులన్ని పూర్తిచేసి త్వరలోనే తన పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ చెబుతారని తెలుస్తోంది.దీంతో ప్రభాస్ (Prabhas) పెళ్లి వార్తలకు పుల్ స్టాప్ పడింది అంటూ కొన్ని వార్తలు నెట్టింట్లో లో వైరల్ గా మారాయి. అయితే ఈ విషయం చాలామంది నిజమే అని భావిస్తున్నారు. ఎందుకంటే శర్వానంద్ గురించి పెళ్లి వార్తలు వస్తున్నప్పటికీ ఆయన స్పందించడం లేదు. అందుకే ఆయన పెళ్లి నిజంగానే చేసుకుంటున్నారని సమాచారం. అలాగే ప్రభాస్ కూడా ఈ ఏడాది కచ్చితంగా పెళ్లి చేసుకుంటారని ఇప్పటికే ఎన్నోసార్లు స్పష్టం చేశారు.