మంగళవారం కదిరి పట్టణంలోని ఇఖ్రా స్కూల్, నిజాంవలి కాలనీ (అల్ ఖైర్ నగర్) లో పీపుల్స్ హెల్త్ సొసైటీ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు సిఎస్ ఇస్మాయిల్ ఆజాద్, మదన్ కుమార్ మాట్లాడుతూ పీపుల్స్ హెల్త్ సొసైటీ ఆధ్వర్యంలో పేదల నివసించే ప్రాంతంలో ప్రత్యేకించి బీడీ కార్మికుల నివాస ప్రాంతంలో మెడికల్ క్యాంపు నిర్వహించడం అభినందనీయమన్నారు. వృద్ధులు, మహిళలు, పిల్లలు, బీడీ కార్మికులు శిబిరానికి వచ్చి వైద్య సేవలు పొందారు. పీపుల్స్ హెల్త్ సొసైటీ వారు వీరికి ఉచితంగా మందులు అందించారు. ఈ మెడికల్ క్యాంపులో డాక్టర్లు సిఎస్ ఇస్మాయిల్ ఆజాద్, సివి, మదన్ కుమార్, తన్విర్ అలీ ఖాన్, ఎం.నిశ్చల, బి. నారాయణస్వామి నాయక్ వైద్య సేవలు అందించారు. పీపుల్స్ హెల్త్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న డాక్టర్లకు నిర్వాహకులు రామక్రిష్ణ, జి.ఎల్. నరసింహులు, జగన్మోహన్, సాంబశివ, ముస్తాక్, బాబ్ జాన్, ఉదయ్ కృతజ్ఞతలు తెలిపారు

