AP

తాడిపత్రిలో ఘోరం: భార్యను హత్య చేసి కొండల్లో పడేసిన భర్త

అనంతపురం జిల్లా తాడిపత్రిలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో సుధాకర్ అనే వ్యక్తి తన భార్య శ్రీలేఖను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం ఎవరికీ తెలియకుండా మృతదేహాన్ని ముచ్చుకోట కొండల్లో పడేసి ఆచూకీ లభ్యం కాకుండా చేసేందుకు ప్రయత్నించాడు.

అయితే, ఈ ఘోరానికి పాల్పడిన తర్వాత నిందితుడు సుధాకర్ నేరుగా పప్పూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. నిందితుడి వాంగ్మూలం మేరకు పోలీసులు ముచ్చుకోట కొండ ప్రాంతానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు హత్యకు గల పూర్తి కారణాలపై విచారణ జరుపుతున్నారు.