కదిరి:- ఆర్టీసీ బస్టాండులో దివ్యాంగుల కొరకు మెట్ల వాలువంతెన ఏర్పాటు:- రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కొరకు తేది: 18.3.2026 నుండి ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం నకు అనుమతి ఇచ్చినది. తద్వార రోజు వందల మంది దివ్యాంగులు ఆర్టీసీ బస్టాండుకు విచ్చేసి,ప్రయాణం చేస్తున్నారు. మరియు ఆర్టీసీ బస్టాండులో వున్న డిఎం ఆఫీసుకు రోజు వచ్చే దివ్యాంగులతో పాటు పదవీ విరమణ పొందిన ఆర్టీసి విశ్రాంత ఉద్యోగులకు బస్టాండు ఎంట్రన్స్ లో మెట్లను ఎక్కే బాధవుండేది. ఈ విషయాన్ని గమనించిన ఇన్-చార్జి డిపో మేనేజర్ డి.రామక్రిష్ణ గారు మెట్ల నందు వాలు వంతెన ఏర్పాటు చేసి, ఆదివారం దివ్యాంగులను నడిపించి, ప్రారంభించినారు. డిపో మేనేజరు బి.మైనోద్దీన్ సహాయ,సహకారములతో ఈ సౌకర్యము కల్పించినందులకు కదిరి డిపో ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగులు హరిమోహన్, బాష, సురేంద్ర రెడ్డి, నరశింగరావు, ఓబులేసు, రామ్మోహన్ రెడ్డి తదితరులు ఇన్-చార్జి డిపో మేనేజరు రామక్రిష్ణ కు ధన్యవాదములు తెలిపారు.

