AP

వైసీపీ పాలనకు చరమగీతం పాడే రోజు దగ్గర్లోనే ఉంది : టిడిపి నాయకులు శ్రీరామినేని జయరాం నాయుడు

(విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తున్న శ్రీరామినేని జయరాం నాయుడు)

కె. ఈశ్వర్ – ప్రత్యేక ప్రతినిధి

అన్నమయ్య జిల్లా

వైసిపి పాలనకు చరమగీతం పాడే రోజు దగ్గర్లోనే ఉందని టిడిపి నాయకులు శ్రీరామినేని జయరాం నాయుడు అన్నారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక సీనియర్ నాయకుడైన చంద్రబాబునాయుడు కాన్వాయ్ పై కరెంట్ ఆఫ్ చేసి రాళ్లు రువ్వడం ఎంత వరకు సమంజసమన్నారు. నిన్న 2 సెంట్ల భూమి వ్యత్యాసం ఉందన్న నెపంతో అయ్యన్నపాత్రుడు ని రాత్రికి రాత్రి కనీసం చెప్పులు కూడా వేసుకుని ఇవ్వకుండా అరెస్టు చేయడం చూస్తుంటే ఇది రాక్షస పాలన అని స్పష్టంగా అవగతమవుతుందన్నారు. రెండు సెంట్ల కోసం కోసం అంత యాగీ చేసిన వైసిపి నాయకులు రెండు వేల ఎకరాలు, మూడు ఎకరాలుకబ్జా చేస్తుండటం ప్రజలు గమనిస్తున్నారని సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారన్నారు. రాబోయే కాలంలో వైకాపాకు ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు.ఇవన్నీ చూస్తుంటే అసలు ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా రాజరిక పాలన కొనసాగుతుందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.