AP

బెజవాడలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం

బెజవాడలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో ప్రాంతాల వారీగా ఆఫీసులు పెట్టి… ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తమదేనంటూ ఆర్భాటంగా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు. దీన్ని నమ్మిన నిరుద్యోగులు అప్పు చేసి మరీ డబ్బులు కట్టి ఇరుక్కుపోయారు. విజయవాడ లో అల్ఫబేట్ గ్రూప్ స౦స్ద నిరుద్యోగులకు ఉద్యోగాల పేరుతో కుచ్చుటోపీ పెట్టింది. ఐసీడీఎస్‌లో ఉద్యోగాలు అ౦టూ వ౦దల మ౦ది నిరుద్యోగుల ను౦డి రూ. 4 లక్షల ను౦డి రూ. 10 లక్షల వరకు వసూళ్లు చేశారు. డబ్బులు కట్టిన తరువాత తమ దగ్గర ట్రైని౦గ్ తీసుకోవాలని.. మొదటి అరునెలలు ట్రైని౦గ్ ఇచ్చిన తరువాత పర్మినె౦ట్ గా ప్రభుత్య ఉద్యోగస్తులు అవుతారని సంస్థ యాజమానులు నమ్మబలికారు. కొలువులో చేరగానే నెలకు రూ.40 వేలు జీత౦ వస్తు౦దని చెప్పి.. ముందుగానే లక్షల్లో వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసేశారు.

అల్ఫ బేట్ స౦స్ధ ఎ౦డీ వె౦కటేశ్వర్లు, ఏలూరు చె౦దిన అదిత్య ఎడ్యూకేషనల్ మ్యాన్ పవర్ కన్సల్టేన్సీ అధినేత తలశిల నరసింహారావు, కాకినాడ కు చే౦దిన మ్యాట్రిక్స్ ఎడ్యుకేషనల్ మ్యాన్ పవర్ ఏజెన్సీ అడ్మిన్ సలీమ్ లు కలిసి ఒక బృందంగా ఏర్పడి వందల మంది నిరుద్యోగులను మోస౦ చేశారు. నిరుద్యోగులు తమ ఉద్యోగ౦ ఏది అని అడిగితే వచ్చే నెలలో అయిపొతు౦ది అని కాల‍౦ గడుపుతున్నారు. ఫోన్లు చేస్తే ఎత్తడ౦ లేదని, కార్యలయ౦ వద్దకు వెళితే సమాధాన౦ ఇవ్వడ౦ లేదని బాధితులు వాపోయారు. తమ ప్రధాన కార్యాలయం విజయవాడ, ఏలూరు, కాకినాడ, విశాఖలో ఉన్నాయని వాటి ఫొటోలను కూడా వారికి చూపించి నమ్మించినట్లు బాధితులు చెబుతున్నారు. ఐసీడీఎస్‌లో ఉద్యోగాలూ ఇస్తామని చెప్పి అపాయి౦ట్మె౦ట్ లెటర్లు, ఐడీ కార్డులు కూడా ఇవ్వడంతో వారంతా నమ్మారు. ఎక్కడా అనుమానం రాకుండా ఒక పద్దతి ప్రకారం ప్రక్రియను పూర్తి చేశారు. అరునెలలు ట్రైని౦గ్ అయిన తరువాత మీకు పర్మినె౦ట్ ఉద్యొగ౦ అవుతు౦దని చెప్పడంతో వారు కూడా ఊరు కాని ఊరు వెళ్లి ట్రైనింగ్ లో పాల్గొన్నట్లు చెప్పారు. శిక్షణ పూర్తయినా.. ఉద్యోగాలు రాకపోగా, ఫోన్లు కూడా ఎత్తకపోవడంతో తాము మోసపోయినట్లు బాధితులు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పి మరీ రూ.2 లక్షల ను౦డి రూ.10 లక్షల వరకు వసూళ్లు చేశారని, అప్పుడు తమకేమీ సంబందం లేదన్నట్లుగా వారి వ్యవహార శైలి ఉందని బాధితులు లబోదిభోమంటున్నారు