AP

ఏ క్షణమైన ఎన్నికలకు(elections) వెళ్లడానికి సిద్ధంగా ఉండేలా వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి క్యాడర్ కు ట్రైనింగ్

ఏ క్షణమైన ఎన్నికలకు(elections) వెళ్లడానికి సిద్ధంగా ఉండేలా వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి క్యాడర్ కు ట్రైనింగ్ ఇస్తున్నారు. అంతేకాదు, ఎన్నికల ప్రక్రియకు అడ్డు వచ్చే అంశాలను తొలగించుకుంటూ వెళుతున్నారు. ఇటీవల టీచర్లను ఎన్నికల(elections) విధులకు దూరంగా ఉంచుతూ ఆర్డినెన్స్ ఇచ్చారు. ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయ వలంటీర్లకు సమాంతరం పార్టీ నుంచి ప్రతి 50 మంది ఓటర్లకు(voters) ఇద్దరు రాజకీయ వలంటీర్లను నియమించాలని దిశానిర్దేశం చేశారు. జిల్లా అధ్యక్షులు, కోఆర్డినేటర్లు, అబ్జర్వర్లతో ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కేంద్రంగా బుధవారం భేటీ అయ్యారు. 2024 ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయడానికి కసరత్తు చేస్తున్నట్టు కనిపించినప్పటికీ ముందస్తు దిశగా ఆయన దూకుడు కనిపిస్తోంది. అందుకే, గతంలో ఏ పార్టీ సిద్ధం కాని విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఆ క్రమంలోనే ప్రతి 50 మంది ఓటర్లకు కాపలాగా ఇద్దరు గ్రామస్థాయి వలంటీర్లను తయారు చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయ వలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని ఇప్పటికే ఎన్నికల కమిషన్ కు టీడీపీ ఫిర్యాదు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వలంటీర్లను అడ్డుపెట్టుకుని ఏ విధంగా ప్రభుత్వం అధికార దుర్వినయోగానికి పాల్పడిందో ఫిర్యాదు చేసింది. ఫలితంగా ఎన్నికలకు దూరంగా వలంటీర్లను ఉంచాలని ఎన్నికల కమిషన్ ఇటీవల నిర్ణయం తీసుకుంది.

దీంతో ప్రత్యామ్నాయంగా ప్రతి 50మంది ఓటర్లకు(voters) ఇద్దరు రాజకీయ వలంటీర్లను ఏర్పాటు చేయడానికి వైసీపీ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం పనిచేస్తోన్న గ్రామ, వార్డు సచివాలయ వలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాలు అన్నీ అందుతున్నాయి. వాళ్లే లబ్దిదారులను ఎంపిక చేయడం నుంచి పథకాలను అందచేసే వరకు చూసుకుంటున్నారు. ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీర్ ను జగన్మోహన్ రెడ్డి సర్కార్ నియమించింది. వాళ్లే అన్నీ తామై గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ చూసుకుంటున్నారు. స్థానిక ప్రజలకు తలలోనాలుక మాదిరిగా ఉన్నారు. అందుకే వాళ్ల ద్వారా ఓటర్లను కొనుగోలు చేయడానికి ఆ పార్టీకి తేలిక అయింది. అందుకే, ఎన్నికల సమయంలో వాళ్ల ప్రమేయంపై టీడీపీ ఫిర్యాదు చేసింది. దీంతో వాళ్లకు బదులుగా జగనన్న సైన్యం రంగంలోకి దింపడానికి వైసీపీ సిద్ధం అయింది. వాలంటీర్లపై పూర్తిగా ఆధారపడలేమనే అభిప్రాయాలు వెల్లడవుతున్న నేపథ్యంలో కీలక భేటీని నిర్వహించారు. ఇదే సమావేశంలో నియోజకవర్గాల వారీగా ఐప్యాక్ అందించిన నివేదికపై కూడా చర్చించారు. ఈ నివేదిక ఆధారంగా మార్పులు, చేర్పులపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గడపగడపకు కార్యక్రమంపై రిపోర్టును పార్టీ శ్రేణుల ముందు ఉంచి, వారికి సూచనలు తీసుకోవడం ద్వారా ఎన్నికలకు సిద్ధం కావడానికి రోడ్ మ్యాప్ ఇచ్చినట్టు తెలుస్తోంది.