AP

ఏపీ పోలీస్ సంక్రాంతి అలెర్ట్‌!!

ఏపీ రాష్ట్రంలో సంక్రాంతి(Sankranti) పడుగకు ఒక ప్రత్యేకత ఉంది. వివిధ ప్రాంతాల నుంచి ఏపీకి వెళ్లి సందడి చేస్తారు. పండుగ సందర్భంగా వేసే కోడి పందెం(Cockfights) గోదావరి జిల్లాలను కళకళలాడేలా చేస్తోంది. చట్టవిరుద్ధంగా నడిచే కోడి పందెం చుట్టూ ప్రతి ఏడాది ఏదో ఒక రూపంలో రాజకీయం నడిచేది. గత ఏడాది ఏకంగా గుడివాడ కేంద్రంగా క్యాసినోస్ నడపడంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అపవాదు తప్పలేదు. ఆ కేసు ఇప్పటికీ నడుస్తోంది. ఆ వివాదం కారణంగా కొడాలి నాని మంత్రి పదవిని పోగొట్టుకున్నారు. గోవా తరహా క్యాసినో నిర్వహించడం ద్వారా సంక్రాంతి సంబరాలను కోడిపందెం(Cockfights) నుంచి మరో రేంజ్ కు వైసీపీ మంత్రి ఆనాడు తీసుకెళ్లారు. ఈసారి చట్ట విరుద్ధంగా సంక్రాంతి(Sankranti) సంబరాలు జరుపుకోవడానికి లేదని పోలీసులు ముందుగా హెచ్చరిస్తున్నారు. కోడిపందాల(Cockfight) నిర్వాహకులపై కోడిపందాల(Cockfights) నిర్వాహకులపై తూర్పు, పశ్చిమగోదావరి ప్రాంత పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కోడిపందెం మైదానాలను పరిశీలిస్తోన్న వాళ్లపై నిఘా పెట్టారు. మైదానాలను ఇవ్వడానికి లేదని భూ యజమానులకు పోలీసుల సూచనలు చేస్తున్నారు. జూద కార్యకలాపాలు జరిగితే అటువంటి మైదానాలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు. కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల ఎస్పీలు ఇప్పటికే అప్రమత్తం అయ్యారు. మైదానాలను గుర్తిస్తున్నారు. కోడి పందెం వేసే సమయంలో కట్టే కత్తుల తయారీదారులపై చర్యలకు ఉపక్రమించారు. కోడి కత్తులను విక్రయదారుల హడావుడిని అరికట్టే పనిలో ఉన్నారు. సంక్రాంతి సందర్భంగా కోడిపందెంతో పాటు నిర్వాహకులు గుండాట, కార్డ్ ప్లే తదితర జూదంను నడిపే ఆనవాయితీ ఉండేది. దాన్ని పోలీసులు ముందుగా గమనించి నిర్వాహకులకు వార్నింగ్ ఇస్తున్నారు.

పశ్చిమగోదావరి జిల్లాల్లో మూడు రోజుల నుంచి నిర్వాహకుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించినట్లు పశ్చిమగోదావరి ఎస్పీ రవిప్రకాష్ వెల్లడించారు. కోడి పందెం, ఇతర జూద నిర్వాహకులుగా అనుమానిస్తూ 180 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వాళ్లలో 80 మందిని మండల మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. నిర్వాహకులు, క్రీడాకారులు, భూమి యజమానులు, కోడి కత్తి తయారీదారులు, అమ్మకందారులుపై కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. జీపీఎస్‌తో అన్ని మైదానాలు(Sankranti) జీపీఎస్‌తో అన్ని మైదానాలు, ప్రదేశాలను అనుసంధానం చేస్తామని పోలీసులు వెల్లడించారు. ఆయా ప్రదేశాలలో ఏదైనా కార్యకలాపాలు గమనించినట్లయితే, సమాచారం తక్షణమే చేరేలా జీపీఎస్ సిస్టమ్ ద్వారా పోలీసులకు చేరుతుంది. కోడిపందాలను(Cockfights) అరికట్టేందుకు హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తాం. మైదానాల సర్వే నంబర్లను సేకరిస్తున్నామని, కోడిపందాల నిర్వాహకులకు భూములు ఇస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. కోడిపందాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అమలాపురం డీఎస్పీ మాధవ రెడ్డి తెలిపారు. ఎవరూ తప్పించుకోకుండా నిర్వాహకులను పోలీసులు వెంటాడుతున్నారు. కాకినాడ డీఎస్పీ రవీంద్రనాథ్ పోలీసు అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి కోడిపందాలను అరికట్టేందుకు చేపట్టాల్సిన ప్రణాళికలను వివరించారు. పిఠాపురం సిఐ వైఆర్‌కె శ్రీనివాస్‌ ఐదు గ్రామాలైన దుర్గాడ, తాటిపర్తి, చెందుర్తి, చిన జగ్గంపేట, కొడవలి గ్రామాల్లో పర్యటించి కోడిపందాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి వాటిని కోడిపందేల నిర్వాహకులకు ఇవ్వొద్దని రైతులకు సూచించారు. ఇలాంటి వార్నింగ్ లు గతంలోనూ కోడి పందెం నిర్వాహకులు చూశారు. ప్రతి ఏడాది పోలీసులు హడావుడి చేస్తుంటారు. సంక్రాంతి వచ్చే నాటికి ఎవరికి వారే యదేచ్ఛగా జూదం ఆడుతుంటారు. న్యాయస్థానం జోక్యం చేసుకుని పోలీసులకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు అమలు కాలేదు. కోట్లాది రూపాయలు జూదం రూపంలో లావాదేవీలు జరిగేవి. స్వర్గీయ వైఎస్సార్ ప్రభుత్వం చూసీచూడనట్ట వదిలేసింది. ఆయన వారసుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో గత రెండేళ్లుగా సంక్రాంతి (Sankranti)సంబరాల్లో జూదం యధేచ్చగా నడిచింది. పైగా కొడాలి నాని, వల్లభనేని వంశీ కనుసన్ననల్లో క్యాసినో కూడా నిర్వహించడం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని హైలెట్‌. ఈసారి సంక్రాంతికి ఎలాంటి వెలుగుజిలుగుల్ని వైసీపీ లీడర్లు చూపిస్తారో చూడాలి. Cock Fight : హైదరాబాద్ శివారులో కోడిపందాలు.21మంది అరెస్టు.పరారీలో చింతమనేని..!!