ఉత్తరాఖండ్ భారీ వరదలు..! ఊరు గల్లంతు.. భారీ ప్రాణ నష్టం..!
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు, వరదలు పెను బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉత్తరకాశీలోని ధరాలీలో కొండపై నుంచి ఒక్కసారిగా వచ్చిన వరద బురదతో ఆ గ్రామం మొత్తం కొట్టుకుపోయింది. ఇప్పటికే నలుగురు మృత్యువాత పడగా, తాజాగా దాదాపు పది మంది సైనికులు వరదనీటిలో గల్లంతైనట్లు తెలుస్తోంది. వరదకు తీవ్రంగా ప్రభావితమైన ధరాలీ గ్రామానికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఆర్మీ బేస్ క్యాంప్ ఉంది. హర్షిల్ ఆర్మీ క్యాంపస్కు దిగువన ఉన్న సైనికులు వరద ఉద్ధృతికి కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది.…