బీఆర్ఎస్ లో వార్..? ఆ పదవి నుండి కవితాను తొలగింపు..!
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ షాక్ ఇచ్చారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీజీబీకేఎస్) నుంచి కవితకు ఉద్వాసన పలికారు. టీజీబీకేఎస్ ఇంఛార్జిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనసాగనున్నారు. మిగిలిన కార్యనిర్వాహక వర్గాన్ని త్వరలోనే నియమించనున్నట్టు తెలుస్తోంది..తెలంగాణ భవన్ లో టీజీబీకేఎస్ నేతల సమావేశం జరిగింది. బీఆర్ఎస్ కు అనుబంధంగానే టీజీబీకేఎస్ పనిచేయాలని సమావేశంలో కేటీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు టీజీబీకేఎస్ కు కవిత అధ్యక్షురాలిగా…