భూలక్ష్మి పేరుతో కవిత సంచలనం..! వారికి ఎకరం భూమి ఫ్రీ..!
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పేదల సంక్షేమం లక్ష్యంగా ఓ భారీ ప్రకటన చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం చొప్పున భూమిని పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆమె, ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశాలను, పార్టీ భవిష్యత్తు కార్యాచరణను వెల్లడించారు. పేదల ఆర్థికాభివృద్ధికి భూమే మూలాధారమని…

