రాజోలిలో ఇథనాల్ చిచ్చు.. రైతుల ఆందోళనతో తీవ్ర ఉద్రిక్తత..
జోగులాంబ గద్వాల జిల్లా, రాజోలి మండలంలోని పెద్ద ధన్వాడ వద్ద ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న రైతులు బుధవారం ఆందోళనను ఉద్ధృతం చేసి, నిర్మాణ ప్రాంతంలోకి చొచ్చుకెళ్లి విధ్వంసానికి పాల్పడ్డారు.. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. పెద్ద ధన్వాడ వద్ద గాయత్రి కంపెనీ ఇథనాల్ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే, ఈ పరిశ్రమ ఏర్పాటును స్థానిక రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.…

