Editor

AP

జగన్ 2.O వస్తది.. అప్పుడు ఒక్కొక్కరికి?: జగన్ సంచలన వ్యాఖ్యలు..

మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని.. జగన్ 2.Oలో కార్యకర్తలకే ప్రాధాన్యం ఇస్తామని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు. తాడేపల్లిలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జగన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.   ‘ఒక కేసులో బెయిల్ రాగానే మరో కేసు పెడుతున్నారు. వంశీ, నందిగం విషయంలో దారుణంగా వ్యవహరిస్తున్నారు. కార్యకర్తలను వేధిస్తున్న వారికి సినిమా చూపిస్తాం. రిటైరైనా, దేశం విడిచి వెళ్లినా రప్పిస్తాం. రాబోయే రోజుల్లో ప్రజల…

AP

జిల్లాల పునర్విభజనపై ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలు..

జిల్లాల పునర్విభజన అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర సచివాలయంలో మంగళవారం మంత్రులతో జిల్లాల పునర్విభజనపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సమయంలో పలు ప్రాంతాల్లో జిల్లా కేంద్రాల ఏర్పాటుకు చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.   ఈ నేపథ్యంలో, కూటమి ఇచ్చిన హామీలపై త్వరితగతిన నివేదిక సమర్పించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నేతలతో పాటు వివిధ సంఘాల వారిని భాగస్వాములను…

National

ఇండియాలో పెరుగుతున్న కరోనా జేఎన్.1 కేసులు… వ్యాధి లక్షణాలు ఇవే..!

దేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ స్వల్పంగా పుంజుకోవడం ఆందోళన కలిగిస్తోంది. మే 19 నాటికి దేశవ్యాప్తంగా 257 యాక్టివ్ కోవిడ్ కేసులు నమోదైనట్లు అధికారిక గణాంకాలు తెలుపుతున్నాయి. ఈ పరిణామంతో అప్రమత్తమైన ఆరోగ్య శాఖ అధికారులు, వ్యాధి వ్యాప్తి తీరుతెన్నులపై నిశితంగా దృష్టి సారించారు. ఇప్పటికే హాంకాంగ్, సింగపూర్ వంటి దేశాల్లో కోవిడ్ కేసులు పెరుగుతుండటం గమనార్హం.ప్రస్తుతం మన దేశంలో కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. అయితే, హాంకాంగ్,…

TELANGANA

తెలంగాణలో 77 మంది డీఎస్పీల బదిలీలు.!

రాష్ట్ర పోలీసు యంత్రాంగంలో సోమవారం భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. డీజీపీ జితేందర్ కీలక ఉత్తర్వులు జారీ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా 77 మంది డీఎస్పీ, ఏసీపీ స్థాయి అధికారులను బదిలీ చేశారు. ఈ బదిలీల ప్రక్రియలో భాగంగా కొందరికి నూతన పోస్టింగులు కేటాయించగా, మరికొందరిని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు.   పోలీసు శాఖలో పరిపాలనా సౌలభ్యం కోసం చేపట్టిన ఈ బదిలీల్లో పలువురు కీలక అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగించారు. జగిత్యాల సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్…

TELANGANA

కాళేశ్వరం దర్యాప్తులో కీలక ట్విస్ట్..! విచారణకు మాజీ సీఎం కేసీఆర్..?

కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించారని భావిస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విచారించిన (క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన) తర్వాతే ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించాలని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ పరిణామం నేపథ్యంలో కమిషన్ గడువును ప్రభుత్వం మరో రెండు నెలల పాటు పొడిగించింది.   వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం జస్టిస్ ఘోష్ కమిషన్ గడువు ఈ నెలాఖరుతో…

AP

ఏపీలోని ఆ జిల్లాల్లో ఉగ్ర కదలికలు..? సీఎస్, డీజీపీకి పవన్ లేఖలు..!

కేంద్రం పాకిస్తాన్ పై చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత ఏపీలోని విజయనగరంలో ఉగ్ర కదలికలు కలకలం రేపాయి. విజయనగరానికి చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి వారు ఐసిస్ ఆదేశాలతో బాంబులు తయారు చేసినట్లు గుర్తించారు. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ ఈ ఘటనపై స్పందించారు. సీఎస్, డీజీపీలకు ఆయన వేర్వేరుగా లేఖలు రాశారు. ఇందులో పలు కీలక అంశాల్ని పవన్ ప్రస్తావించారు.   జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఏపీలోని అన్ని జిల్లాల్లో…

AP

అరెస్టుల వేళ జగన్ వరుస భేటీలు..! కారణం అదేనా..?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. వరుస భేటీలను నిర్వహిస్తోన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే దిశగా కార్యాచరణకు సిద్ధమౌతున్నారు.   జగన్ 2.0 అంటూ గతంలో ప్రకటించారు జగన్. దీనికి అనుగుణంగా అడుగులు వేస్తోన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటోన్నారు. క్యాడర్‌లో…

National

భారత సైన్యానికి కీలక అధికారాలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వం..

పాకిస్థాన్ తో ఇటీవలి ఉద్రిక్తతలు, ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతుండడం వంటి అంశాల నేపథ్యంలో… కేంద్ర ప్రభుత్వం సాయుధ బలగాలకు కీలక అధికారాలను అప్పగించింది. అవసరమైన ఆయుధాలు కొనుగోలు చేసేందుకు ఆర్మీకి ప్రత్యేక అధికారాలు ఇచ్చింది. సుమారు రూ.40,000 కోట్ల పరిమితితో అత్యవసర ఆయుధ సేకరణ (ఎమర్జెన్సీ ప్రొక్యూర్‌మెంట్ – ఈపీ) అధికారాలను త్రివిధ దళాలకు కల్పిస్తూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ) కొద్ది రోజుల క్రితమే ఆమోదముద్ర వేసినట్లు…

AP

నందిగం సురేష్ అరెస్ట్.. తుళ్లూరు డీఎస్పీ కీలక వ్యాఖ్యలు..

వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టుపై తుళ్ళూరు డీఎస్పీ మురళీ కృష్ణ మాట్లాడుతూ.. ఉద్దండరాయునిపాలెం గ్రామంలోని బొడ్డురాయి సెంటర్లో నిలబడి ఉన్న రాజు అనే వ్యక్తిపై నందిగం సురేష్, అతని అన్న మరో ఇద్దరు కారుతో గుద్దారని తెలిపారు. పాత కక్షలు ఉండటంతోనే దాడి చేశారు.. సురేష్ సోదరులు రాజును కొట్టి బైకుపై ఇంటికి తీసుకుని వెళ్లారు.. ఇంటి దగ్గర కూడా పడేసి కాళ్లతో బాధితుడు రాజును కొట్టడం జరిగింది.. రాజును చంపి కృష్ణా…

AP

రాజధాని అమరావతిలో మరో కీలక ప్రాజెక్ట్..?

ఏపీ రాజధాని అమరావతిలో అభివృద్దిని పరుగులు పెట్టించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న కూటమి సర్కార్ ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధానిలో ఇప్పటికే కీలక ప్రాజెక్టుల్ని తెరపైకి తెస్తున్న ప్రభుత్వం.. వాటిని గ్రౌండ్ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో కొత్త ప్రాజెక్టుల్నీ ప్రతిపాదిస్తోంది. ఇదే క్రమంలో ఇవాళ అమరావతి రాజధానిలో సెమీ హైస్పీడ్ సర్కులర్ రైల్ ప్రాజెక్టుపై కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధాని పరిధిలోకి వచ్చే విజయవాడ-గుంటూరు నగరాలను కలుపుతూ…