‘తెలంగాణ రైజింగ్’ అంటే ఎక్సైజ్ ఆదాయం పెంచుకోవడమేనా..: హరీష్ రావు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యం ధరలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ధ్వజమెత్తారు. బీర్లను, బార్లను నమ్ముకుని, మద్యం అమ్మకాల ద్వారా ఖజానా నింపుకోవడమే ‘మార్పు’ అని ప్రస్తుత ప్రభుత్వం చెబుతోందని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గాలికొదిలి, కేవలం ఎక్సైజ్ ఆదాయం పెంచుకోవడంపైనే దృష్టి సారించిందని, “ఎక్సైజ్ ఆదాయంలో ‘తెలంగాణ రైజింగ్’ అంటే ఇదేనా?” అంటూ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను అటకెక్కించి,…

