ఐదో టీ20 రద్దు: 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా!
బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరగాల్సిన ఐదో, చివరి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మ్యాచ్‌ను చూసేందుకు అభిమానులు ఎంతగానో ఎదురుచూసినా, వరుణుడు మాత్రం ఆటకు పూర్తిగా అంతరాయం కలిగించాడు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు (Team India) తరఫున ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ అద్భుతమైన, దూకుడైన ఆరంభాన్నిచ్చారు. కానీ, ఈ జోరును వర్షం నిలిపేయడంతో ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. భారత జట్టు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగింది.…

