Editor

TELANGANA

రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..! మరో కొత్త పథకం..

రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ముఖ్యంగా పోడు రైతులకు ఇది ఊహించని తీపి కబురు. రాష్ట్రవ్యాప్తంగా పోడు పట్టాలు పొందిన 2.10 లక్షల మంది రైతుల కోసం ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకం అమలు చేయాలని భావిస్తోంది. దీని ద్వారా 6 లక్షల ఎకరాల భూములకు ప్రయోజనం చేకూరనుంది. ఈ నెల 18న అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్‌ మండలంలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.   ఇందిర సౌర గిరి జల…

TELANGANA

మంత్రి కొండా సురేఖ కాంట్రవర్సీ కామెంట్స్..

తెలంగాణలో కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ అనగానే గుర్తుకొచ్చేవారిలో మంత్రి కొండా సురేఖ ఒకరు. తనకు ఏదైనా తెలుస్తే ఓపెన్‌గా బయటపెడతారు. ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా పట్టించుకోరు. అవే ఒక్కోసారి ఆమెకి చిక్కులు తెచ్చిపెడుతున్నాయి కూడా. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆమె ఏమన్నారు? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..   మంత్రి కొండా సురేఖ గురించి చెప్పనక్కర్లేదు. మనసులో ఏమీ దాచుకోకుండా నిజాన్ని ఓపెన్‌గా చెప్పేస్తారు. ఆ తర్వాత ఎవరు…

National

రక్షణ రంగంలో భారత్ మరో ముందడుగు..! ‘భార్గవాస్త్ర’ ప్రయోగం విజయవంతం..!

దేశ రక్షణ రంగంలో మరో ముందడుగు పడింది. శత్రు డ్రోన్ల సమూహాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ‘భార్గవాస్త్ర’ కౌంటర్ డ్రోన్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించారు. సోలార్‌ డిఫెన్స్‌ అండ్‌ ఏరోస్పేస్‌ లిమిటెడ్‌ (ఎస్‌డీఏఎల్) ఈ అత్యాధునిక వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఇటీవలి కాలంలో పెరుగుతున్న డ్రోన్ల ముప్పును ఎదుర్కోవడంలో ఇది కీలక పాత్ర పోషించనుంది.   ఒడిశాలోని గోపాల్‌పుర్‌ వద్ద గల సీవార్డ్‌ ఫైరింగ్‌ రేంజ్‌లో ఈ పరీక్షలు జరిగినట్లు ఆర్మీ ఎయిర్‌…

TELANGANA

సరస్వతి పుష్కరాలకు సీఎం రేవంత్.. కాళేశ్వరంలో ఘనంగా ఏర్పాట్లు..

దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వర పుణ్యక్షేత్రం సరస్వతీ పుష్కరాలు ప్రారంభమయ్యాయి.ఇప్పటికే త్రివేణి సంగమం దగ్గర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మంత్రి శ్రీధర్‌ బాబు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పుష్కరఘాట్‌లో పుణ్యస్నానాలు ఆచరించనున్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని చలువ పందిళ్లు, ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆరు రాష్ట్రాల నుంచి దాదాపు 50లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు.   ఉదయం 5.44…

TELANGANA

సీఈ రమణారెడ్డికి సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్..!

రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతి, నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని జలసౌధలో జరిగిన ఈ సమావేశంలో మహబూబ్‌నగర్‌ జిల్లా నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ (సీఈ) రమణారెడ్డికి సీఎం తీవ్ర హెచ్చరికలు జారీ చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. “అక్కడ (గతంలో పనిచేసిన చోట) చేసినట్లు ఇక్కడ కూడా చేస్తే కేసు పెట్టి లోపల వేయిస్తా” అంటూ సీఎం వ్యాఖ్యానించినట్లు సమాచారం. రమణారెడ్డి గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో…

AP

వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు..

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు పోలీసులు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న వంశీని హుటాహుటిన వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తీసుకొచ్చారు పోలీసులు. జైలులో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న క్రమంలో ఈ విషయాన్ని న్యాయాధికారికి వంశీ వివరించారు. ఆక్సిజన్‌ ఎనలైజర్‌ పెట్టుకోవడం వల్ల ముక్కు వద్ద ఉన్న ఎముకలు నొప్పి వస్తున్నాయని చెప్పారు.   గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హుటాహుటిన జైలు నుంచి ఆస్పత్రికి తరలించారు…

AP

ఏపీ లో ఉచిత బస్సు అమలు ముహూర్తం ఖరారు..! ఎప్పుడంటే..?

ఏపీలో మరో పథకం అమలుకు ముహూర్తం ఖరారైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తి కానుండంటంతో ఎన్నికల హామీల అమలు పైన వరుసగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ పథకం అమలు పైన మంత్రివర్గ ఉప సంఘంతో పాటుగా ఆర్టీసీ అధి కారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఇప్పటికే మార్గదర్శకాలు దాదాపు సిద్దం అయ్యాయి. తాజా గా జరిగిన…

National

అప్పటి వరకు ఆ నీళ్లు ఇచ్చేదేలే..! పాక్ కు మరో షాక్..!

కాల్పుల విరమణ అమలులోకి రావడంతో పాకిస్తాన్ కాస్త ఊపిరి పీల్చుకుంది. అయితే పూర్తి స్థాయిలో పాకిస్తాన్ ని క్షమించేది లేదని అంటున్నారు భారతీయ అధికారులు. పాకిస్తాన్ పాపాలకు ప్రాయశ్చిత్తం లేదని, ఉగ్రవాదాన్ని పూర్తిగా పక్కనపెట్టే వరకు ఆ దేశంపై జాలి చూపేది లేదని తేల్చి చెబుతున్నారు. తాజాగా సింధు జలాల పంపిణీ వ్యవహారంపై భారత విదేశాంగ శాఖ అధికారులు మరోసారి స్పష్టత ఇచ్చారు. పాకిస్తాన్ కి సింధు జలాలు వదిలేది లేదని తేల్చి చెప్పారు.   యుద్ధం…

TELANGANA

రైతులు చస్తున్నా అందాల పోటీలలో మునిగి తేలుతున్న రేవంత్ రెడ్డి : కేటీఆర్

ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తున్న రైతన్నల కష్టం మాత్రం తీరడం లేదు. ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి, పంటలు పండించి ధాన్యపు రాశులను మార్కెట్ కు తరలించిన సకాలంలో కొనుగోలు చేయక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకపక్క అకాల వర్షాలు, ఓ పక్క మండుటెండలు అన్నదాతలను విలవిలలాడేలా చేస్తున్నాయి.   మళ్లీ అన్నదాతల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది. అంతేకాదు కొంతమంది అన్నదాతలు పండించిన పంటను అమ్ముకోవడానికి మార్కెట్ కు వెళ్లి వడ దెబ్బతో మృతి చెందుతున్న…

TELANGANA

క్షిపణి తయారీ కేంద్రంగా హైదరాబాద్..!

ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్తాన్‌తో సరిహద్దుల్లో అనిశ్చిత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో, భారత ప్రభుత్వం రక్షణ రంగంలో అప్రమత్తమైంది. బ్రహ్మోస్, ఆకాష్ వంటి కీలక క్షిపణుల తయారీతో పాటు వాటికి అవసరమైన విడిభాగాల ఉత్పత్తిని వేగవంతం చేయాలని సంబంధిత తయారీదారులకు ఆదేశాలు జారీ చేసింది. యుద్ధమేఘాలు కమ్ముకున్నప్పుడు కాకుండా, శాంతి నెలకొన్నప్పుడే సన్నద్ధత కీలకమని కేంద్రం భావిస్తోంది.   క్షిపణి తయారీ కేంద్రంగా హైదరాబాద్ ప్రాధాన్యత భారతదేశపు “మిస్సైల్ క్యాపిటల్”గా పేరుగాంచిన హైదరాబాద్, అనేక ప్రభుత్వ, ప్రైవేట్…