అమరావతికి ప్రధాని మోదీ.. లక్ష కోట్ల పనులకు మే 2న ప్రారంభోత్సవం..!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా శ్రీకారం చుట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మే 2వ తేదీన ప్రధాని అమరావతిలో పర్యటించి, సుమారు లక్ష కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారని మంత్రుల కమిటీ వెల్లడించింది. ప్రధాని పర్యటన విజయవంతం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లపై కమిటీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై చర్చించేందుకు మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్…

