Editor

National

విమాన ఇంజిన్ వైఫల్యాలు.. డీజీసీఏ నివేదికలో కీలక విషయాలు..

భారతదేశంలో గత ఐదేళ్లలో 65 విమాన ఇంజిన్ వైఫల్యాలు నమోదయ్యాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాదం జరిగిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా వివిధ విమానయాన సంస్థలు తమ విమానాల ఇంజిన్‌లు, ఇంధన స్విచ్‌లు మొదలైన వాటిపై అప్రమత్తమయ్యాయి. ప్రమాదాలను నివారించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో డీజీసీఏ ఒక నివేదికను విడుదల చేసింది.   ఈ నివేదికలో కొన్ని కీలక అంశాలను వెల్లడించింది. జనవరి…

National

బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు బాంబు బెదిరింపులు ..

బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. భవనంలో నాలుగు ఆర్డీఎక్స్‌ ఐఈడీ బాంబులు అమర్చామని, మధ్యాహ్నం 3 గంటలకు పేల్చేయబోతున్నట్లు మెయిల్ వచ్చింది.   మెయిల్‌లో బెదిరింపు కామ్రేడ్ పినరయి విజయన్ అనే మెయిల్ ఐడీతో బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. బాంబు స్వ్కాడ్‌తో ముమ్మరంగా గాలించారు. దీనితో వెంటనే భవనాన్ని ఖాళీ చేయించి, బాంబ్ స్క్వాడ్‌, డాగ్ స్క్వాడ్‌, ఫైర్‌ సర్వీసుల బృందాలను రంగంలోకి దింపారు. BSE పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను…

TELANGANA

గోదావరి జలాలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..!

తెలంగాణలో రాబోయే పదేళ్లు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని.. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను చిత్తుచిత్తుగా ఓడించాలని సీఎం రేవంత్ ప్రజలకు పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరిలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.   ‘కాంగ్రెస్ హయాంలో రాష్ట్రం అభివృద్ధి పథం వైపు వెళ్తుందని సీఎం అన్నారు. ‘సాయుధ రైతాంగ, రజాకార్ వ్యతిరేక పోరాటాల గడ్డ నల్గొండ జిల్లా. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో…

TELANGANA

హైదరాబాద్ శివారులో భారీ భూ కుంభకోణం..! ఎంతంటే..?

800 నుంచి వెయ్యి కోట్ల రూపాయలు విలువచేసే భూముల్ని అత్తగారి సొమ్ములా కొట్టేశారు. హైదరాబాద్ శివారులో మొయినాబాద్‌ పురపాలిక పరిధిలోని ఎన్కేపల్లి సమీపంలో భూ కుంభకోణం వెలుగు చూసింది. సర్వే నంబరు 180లోని సర్కారు భూమికి యాజమాన్య హక్కులు ఇప్పిస్తామంటూ దళారులు మోసగించినట్లు రెవెన్యూ అధికారుల విచారణలో బయటపడుతోంది. నకిలీ పత్రాలు సృష్టించి వెయ్యి కోట్ల రూపాయల మేర దోచుకున్నట్టు స్పష్టమవుతోంది. మొయినాబాద్ దగ్గర గోశాల నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేయడంతో.. ఈ కుంభకోణం బయటపడింది.…

TELANGANA

మాజీ ఇంజనీర్ మురళీధర్‌రావు అరెస్టు..! సోదాల్లో భారీగా ఆస్తులు..

తెలంగాణ నీటి పారుదల శాఖ మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్‌రావు అరెస్టు అయ్యారు. మంగళవారం ఉదయం బంజారాహిల్స్‌లోని ఆయన ఇంట్లో అదుపులోకి తీసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. మురళీధర్‌రావుకు సంబంధించి బంధువులతోపాటు హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్‌ ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు.   కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఇరిగేషన్ శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్‌గా పని చేశారు మురళీధర్‌రావు. ఆయన అరెస్టుతో కొందరి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏసీబీ…

AP

ఏపీలో ఆపరేషన్ గరుడ దూకుడు..! భారీగా కేసులు నమోదు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి వ్యాప్తిని నియంత్రించడంలో.. ప్రభుత్వం చేపట్టిన కృషి ఫలితాలను ఇవ్వడం ప్రారంభించిందని.. హోమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. గతంలో ఏపీ గంజాయి హబ్‌గా పేరు గాంచిందని, ఇతర రాష్ట్రాల్లో గంజాయి పట్టుబడితే అది ఏపీ నుంచే వచ్చినదిగా భావించేవారని ఆమె గుర్తు చేశారు.   ఈ అంశాన్ని సమగ్రంగా ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి ప్రతిపాదనతో.. ‘ఈగల్’ అనే ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశారని మంత్రి తెలిపారు. రవికృష్ణను డైరెక్టర్‌గా నియమించి ఈగల్‌ను కార్యాచరణలోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం…

Uncategorized

‘గొడ్డలి’ గుర్తు కావాలంటూ ఎన్నికల సంఘానికి వైసీపీ లేఖ..!

దేశ రాజకీయాల్లో వైసీపీ ట్రెండ్ సెట్ చేస్తోందా? ఆ పార్టీ ఎందుకు గుర్తు మార్చాలని డిసైడ్ అయ్యింది? ఫ్యాన్ కంటే ‘గొడ్డలి’ గుర్తు మాంచి స్పందన వస్తుందా? ఫ్యాన్ గుర్తుకు కాలం చెల్లినట్టేనా? రాబోయే కాలమంతా గొడ్డలిదేనని అనుకుంటోందా? గొడ్డలి గుర్తుతో ప్రజలను భయపెట్టడం ఖాయమా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.   వైసీపీ ఫౌండర్ శివకుమార్ పేరిట సోషల్‌మీడియాలో ఓ లేఖ హంగామా చేస్తోంది. దాని సారాంశం ఏంటంటే.. గొడ్డలి గుర్తు కావాలంటూ ఎలక్షన్ కమిషన్‌కు…

AP

వైసీపీ రీకాలింగ్ మేనిఫెస్టో.. ! ఎందుకంటే..?

చంద్రబాబు మేనిఫెస్టోని గుర్తుకు తెస్తూ.. అంటూ ఏపీలో వైసీపీ ఇంటింటి తలుపుతట్టే కార్యక్రమం చేపట్టింది. అయితే ఇందులో పెద్దనేతలెవరూ యాక్టివ్ గా పాల్గొనడం లేదు. ఇంటింటికీ వెళ్లి ప్రజల్ని కలసి కూటమి మేనిఫెస్టో సరిగా అమలు కావడం లేదని చెప్పడం జగన్ ఉద్దేశం. కానీ ఆయన ఉద్దేశాల్ని ఆశల్ని నేతలు పట్టించుకోలేదు. చోటా మోటా నేతలు మాత్రం క్యూఆర్ కోడ్ ఉన్న ప్లకార్డులు పట్టుకెళ్లి జనం దగ్గర నిలబడి ఫొటోలు తీసుకుని సోషల్ మీడియాలో అప్ లోడ్…

AP

పేర్ని నాని వివాదాస్పద వాఖ్యలు..! న్యాయస్థానానికి పేర్నినాని.

కోరి కష్టాలు తెచ్చుకోవడమంటే ఇదేనేమో..? తనపై వరుసగా కేసులు నమోదు కావడంతో బెంబేలెత్తుతున్నారు మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని. కేసుల నుంచి బయటపడేందుకు చివరకు న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తుంది. ఇంతకీ అసలేం జరిగింది? నాని ఎందుకు భయపడ్డారు? కేవలం కార్యకర్తలను రెచ్చగొట్టాలని భావించి చిక్కుల్లో పడ్డారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.   వైసీపీ అధినేత జగన్ తర్వాత వార్తల్లోకి వస్తున్నారు మాజీ మంత్రి పేర్ని నాని. అధినేత స్టయిల్‌లో మాటలు ఆడుతూ కార్యకర్తలను…

CINEMA

విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత..

విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు ఈ ఉదయం కన్నుమూశారు. వందలాది సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసి ‘కోట’గా చిరపరిచితులైన ఆయన ఈ తెల్లవారుజామున ఫిలింనగర్‌లోని ఆయన నివాసంలో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. కోట శ్రీనివాసరావు 1942 జులై 10న కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు. 1968లో రుక్మిణిని వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. కొడుకు కోట ప్రసాద్ 21 జూన్…