తాలిబన్ల మరో వికృత చర్య.. జుట్టు అందంగా అలంకరించుకున్నా జైలుకే..!
ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్లు ఇప్పుడు పురుషులపైనా కత్తిగట్టారు. ఆధునిక పోకడలు పోయి జుట్టును అందంగా కత్తిరించుకుంటే ఇక ఊచలు లెక్కపెట్టుకోవాల్సిందే. జుట్టును అందంగా కత్తిరించుకున్న పురుషులతో పాటు, వారికి క్షవరం చేసిన క్షురకులను కూడా అరెస్ట్ చేస్తున్నారని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. కట్టుబాట్ల పేరుతో ఇప్పటి వరకు మహిళలపై అనేక ఆంక్షలు విధించిన తాలిబన్లు ఇప్పుడు పురుషులపైనా పడ్డారని ఐక్యరాజ్య సమితి ఆవేదన వ్యక్తం చేసింది. తాలిబన్ ప్రభుత్వంలోని ‘సదాచార, దురాచార నిరోధ మంత్రిత్వశాఖ’ చర్యల వల్ల…

