రాజీనామా పై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సెన్సేషనల్ కామెంట్స్..!
తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తన రాజీనామాపై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్సీల అంశం ముగిశాక తన ఎమ్మెల్సీ రాజీనామా గురించి ఆలోచిస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తాను బయటకి రాలేదని.. కావాలనే కాంగ్రెస్ బయటికి పంపిందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీల ద్రోహి.. కాంగ్రెస్ పార్టీని తమ పార్టీలో విలీనం చేస్తామంటే ఒప్పుకుంటామని అన్నారు.…

