భారత్ మా పక్షానే ఉంది.. జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు..
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో భారత్‌ను నిందించలేమని, ఆ దేశం చాలావరకు తమ పక్షానే ఉందని స్పష్టం చేశారు. అమెరికాకు చెందిన ఫాక్స్ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యాతో ఆర్థిక సంబంధాలు కొనసాగిస్తూ భారత్, చైనాలు యుద్ధానికి దోహదపడుతున్నాయా? అని ఇంటర్వ్యూలో హోస్ట్ బ్రెట్ బేయర్ ప్రశ్నించారు. దీనికి జెలెన్‌స్కీ బదులిస్తూ,…

