కర్నూలు జిల్లాలో రిలయన్స్ భారీ ప్లాంట్..! రూ.1622 కోట్లతో
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కర్నూలు జిల్లా సమీపంలో భారీ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు రిలయన్స్ సంస్థకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా రూ.1622 కోట్ల పెట్టుబడితో పాటు, స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా లభించనున్నాయి. వివరాల్లోకి వెళితే, శీతలపానీయాలు, పండ్ల రసాలు, మరియు డ్రింకింగ్ వాటర్ తయారీకి సంబంధించిన పరిశ్రమను స్థాపించేందుకు రిలయన్స్ సంస్థ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.…

