కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు.. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. అయితే, ఇదే సమయంలో పార్టీ కార్యకర్తలు మాత్రం కొంత అసంతృప్తితో ఉన్నారని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం జరిగిన తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) సమావేశంలో జగ్గారెడ్డి ఈ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన గత బీఆర్ఎస్ ప్రభుత్వం…

