Editor

TELANGANA

రేవంత్ కేబినెట్.. బీసీల 42 శాతం రిజర్వేషన్లు, 11 వేల పోస్టులకు గ్రీన్‌సిగ్నల్..

తెలంగాణలో బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రేవంత్‌రెడ్డి మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించేలా ఒక బిల్లు ముసాయిదా తీసుకురానుంది. అలాగే విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రెండో బిల్లు ముసాయిదా తయారు చేశారు అధికారులు. ఈ రెండు బిల్లులను అసెంబ్లీలో ప్రవేశ పెట్టాలని మంత్రివర్గం తీర్మానం చేసింది. 2017లో అసెంబ్లీ ఆమోదించిన రిజర్వేషన్ల పాత…

TELANGANA

హైడ్రా, ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో హైదరాబాద్‌లో అరాచకం: కేటీఆర్..

హైడ్రా పేరుతో, ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో హైదరాబాద్‌లో అరాచకం సృష్టిస్తున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ‘పడిపోయిన రిజిస్ట్రేషన్లు’ అంటూ వార్తాపత్రికలో వచ్చిన కథనాన్ని కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేస్తూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.   అధికారం కోసం ఎల్ఆర్ఎస్‌ను రద్దు చేస్తామని చెబుతారని, అధికారం దక్కిన తర్వాత ఆదాయం కోసం ఎల్ఆర్ఎస్ ముద్దు అంటారని ఎద్దేవా చేశారు. హైడ్రా, ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో హైదరాబాద్‌లో అరాచకం సృష్టిస్తున్నారని ఆరోపించారు. మూసీ…

AP

విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..

ఏపీ సీఎం ఢిల్లీ టూర్ నేటితో ముగిసింది. మరికాసేపట్లో అమరావతి బయలుదేరనున్నారు సీఎం చంద్రబాబు. ఢిల్లీ పర్యటనలో భాగంగా.. నిన్న కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ ను కలిశారు సీఎం చంద్రబాబు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై కేంద్రమంత్రి కట్టర్ తో చర్చించారు. విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు వందశాతం.. సాయం అందించండని కేంద్ర మంత్రి కట్టర్ ను కోరారు సీఎం చంద్రబాబు.   ఆంధ్రప్రదేశ్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, ఆర్థిక వృద్దిని పెంపొందించడానికి పట్టణాల్లో…

AP

ఎమ్మెల్సీ ఎన్నికలు.. నామినేషన్ వేయనున్న నాగబాబు..

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు జనసేన నేత కొణిదెల నాగబాబు కాసేపట్లో నామినేషన్ వేయనున్నారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ జనసేన పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు గురువారం సాయంత్రం సంతకాలు చేశారు. నాదెండ్ల మనోహర్, పంచకర్ల రమేశ్ బాబు, పత్సమట్ల ధర్మరాజు, లోకం మాధవి, ఆరణి శ్రీనివాసులు, మండలి బుద్ధ ప్రసాద్, విజయ్ కుమార్, బత్తుల రామకృష్ణ, పంతం నానాజీ, ఆరవ శ్రీధర్ సంతకాలు చేశారు. నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత ఆయనను మంత్రివర్గంలోకి తీసుకునే…

TELANGANA

ఒంటిపూట బడులపై సర్కార్ కీలక నిర్ణయం..! ఎప్పటినుండి అంటే..?

ఎండల తీవ్రత పెరుగుతోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో, ఒంటి పూట బడుల నిర్వహణ పైన విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది. గతం కంటే ముందుగానే ఏడాది ప్రభుత్వ, ప్రయివేటు స్కూళ్లల్లో ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే విద్యా శాఖ అధికారులు వచ్చే విద్యా సంవత్సరం అకడమిక్ క్యాలెండర్ ఖరారు చేసారు. అయితే, ఎండల తీవ్రత నేపథ్యంలో ఒంటిపూట బడుల పైన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పాఠశాలల నిర్వహణ సమయాలను ఖరారు…

TELANGANA

నేడు రేవంత్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ..

ఈరోజు తెలంగాణ కేబినేట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలపడానికి అవసరమైన బిల్లులను ఈ సమావేశంలో ఆమోదిస్తారు. అలాగే బీసీలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను పెంచే బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే తేది, బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీలను ఖరారు చేయనున్నారు. టూరిజం పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. వీటితో పాటు పలు అంశాలకు…

CINEMANational

14 కిలోల బంగారంతో పట్టుబడిన కన్నడ నటి…

బంగారం అక్రమ రవాణా కేసులో కన్నడ హీరోయిన్ రన్యారావును బెంగళూరు విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఆమె నుంచి 14 కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఆమె తను సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్తెనని చెప్పడంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయినప్పటికీ పోలీసులు ఆమెపై అక్రమ బంగారం రవాణా కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.   సీనియర్ ఐపీఎస్ అధికారి, ప్రస్తుత కర్ణాటక పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ డీజీ డాక్టర్ కె రామచంద్రరావు…

AP

సైకో జగన్ మాటలు ప్రజలు నమ్మొద్దు: మంత్రి నారాయణ..

ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర పట్టణాభివృద్ధి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మండిపడ్డారు. సైకో జగన్ మాటలు ప్రజలు నమ్మొద్దని సూచించారు. అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాట ఆడారని విమర్శించారు. రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రజలపై ఒక్క పైసా భారం ఉండదని మంత్రి నారాయణ స్పష్టంచేశారు.   ప్రపంచంలోని టాప్-5 సిటీల్లో అమరావతిని నిలబెట్టడమే చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాజధానికి సంబంధించి రూ.64…

AP

గుంటూరులో దువ్వాడ శ్రీనివాస్ పై కేసు నమోదు..

వైసీపీ నేతలను కేసులు వెంటాడుతున్నాయి. కూటమి ప్రభుత్వ పెద్దలు మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతోందంటున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై కేసు నమోదైంది. పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై గుంటూరు నగరంపాలెం పీఎస్ లో దువ్వాడ శ్రీనివాస్ పై కేసు నమోదు చేశారు. జనసేన నాయకుడు అడపా మాణిక్యాలరావు ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు.   అటు, ఇదే అంశంపై విజయనగరంలోనూ దువ్వాడపై ఫిర్యాదు…

AP

తనకు లేని అధికారాన్ని జగన్ కోరుకుంటున్నారు : నాదెండ్ల..

AP : ప్రతిపక్ష హోదాపై YCP నేతలు కావాలనే బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. జగన్ తనకు లేని అధికారాన్ని కోరుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు గౌరవం ఇవ్వకుండా ఛీ కొట్టినప్పుడు హోదా ఇవ్వాలని ఎలా కోరుకుంటారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ప్రచార మాధ్యమాల్లో చేస్తున్న దుష్ప్రచారంపై సభా హక్కుల సంఘానికి నివేదించాలని జనసేన తరఫున కోరుతున్నట్లు తెలిపారు.