లండన్ నుంచి రాగానే ఫామ్‌హౌస్‌కు.. కవిత ఆరోపణలపై కేసీఆర్‌తో హరీశ్ భేటీ..
మాజీ మంత్రి హరీశ్‌రావుపై కవిత చేసిన తీవ్ర ఆరోపణలు సృష్టించిన రాజకీయ ప్రకంపనల నడుమ కీలక పరిణామం చోటుచేసుకుంది. విదేశీ పర్యటనను ముగించుకుని ఈ ఉదయం నగరానికి చేరుకున్న హరీశ్‌రావు మరికాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో సమావేశం కానున్నారు. ఈ భేటీ కోసం ఆయన నేరుగా ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు బయలుదేరి వెళ్లారు. కవిత ఇటీవల హరీశ్‌రావుతో పాటు ఎంపీ సంతోష్‌రావుపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వారిద్దరూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో టచ్‌లో ఉన్నారని,…

