Editor

AP

శ్రామికులందరికీ రూ. 3 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు ఉచిత ప్రమాద బీమా సౌకర్యం: పవన్ కల్యాణ్..

దేశ నిర్మాణంలో శ్రామికుల పాత్ర అత్యంత కీలకమని, వారు లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. కార్మిక దినోత్సవం (మేడే) పురస్కరించుకుని ఈరోజు ఆయన శ్రామికులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, శ్రామికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు.   ఇకపై కార్మికులను ‘కూలీలు’ అని కాకుండా ‘ఉపాధి శ్రామికులు’ అని గౌరవంగా సంబోధించాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. కష్టపడి పనిచేసే…

TELANGANA

తెలంగాణలో రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ లకు కీలక పదవులు..!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని సర్కారు పలువురు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ లను కీలక పదవుల్లో నియమించింది. ఈ క్రమంలోనే టీటీడీ జేఈవోగా సేవలందించిన మాజీ ఐఏఎస్ అధికారి కె.ఎస్. శ్రీనివాసరాజును ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. ఆయన ఈ బాధ్యతను రెండు సంవత్సరాల పాటు నిర్వర్తించనున్నారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన శ్రీనివాసరాజు గతంలో సుదీర్ఘ కాలం పాటు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) జేఈవోగా బాధ్యతలు నిర్వహించారు.…

Uncategorized

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం..! టీం లో కీలక మార్పులు..!.

ముఖ్యమంత్రి రేవంత్ పాలనా పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధికార యంత్రాంగ ప్రక్షాళన మొదలు పెట్టారు. తన కార్యాలయంలోనూ మార్పులు చేస్తున్నారు. అనుభవం.. అంకిత భావం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కొందరు అధికారుల తీరు పైన సీఎం రేవంత్ ఆగ్రహం తో ఉన్నట్లు తెలుస్తోంది. తన అంచనాలకు తగినట్లుగా పని చేసే వారికి ప్రాధాన్యత ఇవ్వాలని రేవంత్ నిర్ణయించారు. అందులో భాగంగా తాజాగా తన టీంలో ఏరి కోరి ఎంపిక చేసిన వారికి అవకాశం కల్పిస్తున్నారు.…

National

దాయాది దేశం ప్రకటన.. సైనిక చర్యకు భారత్ రెడీ..!

పహల్‌గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌లో అసలైన వణుకు మొదలైందా? భారత్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటోందనని భయంతో వణికిపోతుందా? తమ మీద భారత్ దాడి చేయడం ఖాయమని ఎందుకు అంటున్నారు పాక్ మంత్రులు? ఈ లెక్కన ఉగ్రదాడి గురించి వారికి ముందే తెలుసా? జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే.. భారత్ మరో 24 నుండి 36 గంటల్లో పాకిస్తాన్‌పై సైనిక చర్యకు దిగే అవకాశం ఉందన్నారు ఆదేశ సమాచార శాఖమంత్రి అట్టాఉల్లా తారర్. దీనికి సంబంధించి రహస్య సమాచారం…

TELANGANA

కొత్త డీజీపీ..! డీజీపీ రేసులో ఎవరెవరంటే..?

ఇప్పటికే సీఎస్ శాంతికుమారి టర్న్ పూర్తి అయింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావు ఎంపికయ్యారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో డీజీపీ జితేందర్ రిటైర్ కానున్నారు. ఆయన స్థానంలో కొత్త పోలీస్ బాస్ కోసం ప్రభుత్వం కసరత్తు కంప్లీట్ చేసింది.   డీజీపీ రేసులో ఎవరెవరంటే..   డీజీపీ రేసులో 8 మంది సీనియర్ ఐపీఎస్‌లు ఉన్నారు. ఎనిమిది మంది అధికారుల పేర్లతో కూడిన జాబితాను యూపీఎస్సీకి పంపించింది తెలంగాణ ప్రభుత్వం. రవి గుప్తా, సీవీ ఆనంద్,…

AP

జిల్లా పార్టీ అధ్యక్షులతో వైసీపీ అధినేత జగన్ భేటీ.. ఇకపై నిత్యం ప్రజల్లో ఉండాలని సూచన..!

జిల్లా పార్టీ అధ్యక్షులతో వైసీపీ అధినేత జగన్ సమావేశమయ్యారు. ఇకపై నిత్యం ప్రజల్లో ఉండాలని ఆయన వారికి సూచించారు. “ఎవరి ఆదేశాలకోసమో మీరు ఎదురు చూడొద్దు, మీకు మీరుగా స్వచ్ఛందంగా కదలాలి. నియోజకవర్గ ఇన్‌ ఛార్జితో కలిసి మొదట కదలాల్సింది జిల్లా అధ్యక్షులే.. రాష్ట్ర కార్యాలయం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోయినా లోకల్ గా కార్యక్రమాలు చేయాలి, వాటితో హైలైట్ కావాలి” అని వారికి ఉద్భోదించారు. స్తబ్దుగా ఉన్న జిల్లా పార్టీ శ్రేణుల్లో కదలిక తెచ్చేందుకు జగన్…

AP

సింహాచలంలో చందనోత్సవం వేళ తీవ్ర విషాదం.. ఎనిమిది మంది భక్తులు మృతి..!

విశాఖ సిటీలోని సింహాచలం అప్పన్నస్వామి చందనోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. స్వామివారి నిజ రూపాన్ని దర్శించుకోక ముందే ఎనిమిది భక్తులు ఈ లోకాన్ని వదిలిపెట్టారు. భక్తులు క్యూ లైన్‌లో ఉండగా సమీపంలోకి గోడ కూలింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.   మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది. అర్థరాత్రి సింహాచలంలో భారీ వర్షం కురిసింది. బస్టాండ్ నుంచి దేవాలయానికి వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్…

AP

గ్రూప్ 1లో అక్రమాలు .. పీఎస్ఆర్‌పై మరో కేసు నమోదు..

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుపై మరో కేసు నమోదైంది. ఇదివరకే ముంబయి నటి కాదంబరి జత్వానీ కేసులో అరెస్టై ఆయన విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.   అయితే ఆ సమయంలో గ్రూప్ 1 (2018) ప్రధాన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన వ్యవహారంలో అవకతవకలు, నిధుల దుర్వినియోగం చోటుచేసుకున్నట్లు ఫిర్యాదులు…

AP

విశాఖకు త్వరలో గూగుల్… సీఎం చంద్రబాబు ప్రకటన..!

అమరావతిలోని విట్ యూనివర్సిటీలో ‘వి లాంచ్‌పాడ్ 2025 – స్టార్టప్ ఎక్స్‌పో’లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం నూతన భవనాలు ప్రారంభించారు. విద్యార్థులతో మాట్లాడారు.   రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా, తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని వివరించారు.   విశాఖపట్నం అభివృద్ధి ప్రణాళికలను వివరిస్తూ,…

National

భారత్ మాపై దాడి చేయడం ఖాయం: పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు..

కశ్మీర్‌లో ఇటీవల పర్యాటకులపై జరిగిన ఘోర ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ వైపు నుంచి సైనిక దాడి జరిగే అవకాశం ఉందని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ముహమ్మద్ ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దాడి తర్వాత ఇరు అణ్వస్త్ర దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి.   గత వారం ఏప్రిల్ 22న కశ్మీర్‌లో పర్యాటకులే లక్ష్యంగా జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. పౌరులపై జరిగిన ఈ దారుణ…