ఛత్తీస్గఢ్లో 170 మంది నక్సలైట్లు లొంగుబాటు: “నక్సలిజంపై పోరులో ఇది చారిత్రాత్మక రోజు” – కేంద్ర హోంమంత్రి అమిత్ షా
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నక్సలిజం నిర్మూలన దిశగా మరో కీలక అడుగు పడింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో భాగంగా గురువారం 170 మంది నక్సలైట్లు అధికారుల ఎదుట లొంగిపోయారు. ఈ పరిణామాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా “నక్సలిజంపై పోరాటంలో చారిత్రాత్మక రోజు”గా అభివర్ణించారు. అభూజ్మఢ్, ఉత్తర బస్తర్ ప్రాంతాలు ఇక నక్సల్ ఉగ్రవాదం నుండి విముక్తి పొందాయని ఆయన ట్వీట్ చేశారు. లొంగిపోయిన వారిలో పలు కీలక దళ నాయకులు, ఆయుధ బాధ్యులు ఉన్నట్లు సమాచారం.…

