అడ్డదారుల్లో మన దేశంలోకి తన ఉత్పత్తులను పంపించేందుకు యత్నిస్తున్న పాకిస్థాన్..
ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ నుంచి దిగుమతులపై భారత్ పూర్తిస్థాయిలో నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే, ఈ నిషేధాన్ని తప్పించుకుని, తమ ఉత్పత్తులను ఎలాగైనా భారత మార్కెట్లోకి చేర్చేందుకు పాకిస్థాన్ ఇతర మార్గాలను అన్వేషిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ మేరకు పలు ఆంగ్ల మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, సుమారు 500 మిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను ముఖ్యంగా పండ్లు, ఎండు ఖర్జూరాలు, వస్త్రాలు,…

