భారత్‌లో స్టార్‌లింక్ సేవలు..!
టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్‌కు చెందిన శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవల సంస్థ స్టార్‌లింక్ భారతదేశంలో తన కార్యకలాపాలు ప్రారంభించే దిశగా కీలక ముందడుగు వేసింది. కేంద్ర టెలికం విభాగం నుంచి ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ అందుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో దేశంలో చౌక ధరలకే వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు మరింత మెరుగయ్యాయి. శాటిలైట్ కమ్యూనికేషన్ ఆపరేటర్ల కోసం నిర్దేశించిన నూతన జాతీయ భద్రతా మార్గదర్శకాలకు కట్టుబడి ఉంటామని స్టార్‌లింక్…

