కరెంట్ ఛార్జీల పెంపుపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కీలక ప్రకటన..
ఏపీలో కరెంట్ ఛార్జీలు పెంచుతున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీంతో గృహ వినియోగదారులు ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇళ్లకు వస్తున్న కరెంట్ బిల్లులు భయపెడుతున్నాయని, మరోసారి ధరలు పెంచితే ఎలాగంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. ఈ మేరకు ఆయన కరెంట్ ఛార్జీల పెంపుపై కీలక ప్రకటన చేశారు. ఎట్టిపరిస్థితుల్లో విద్యుత్…

