Editor

TELANGANA

రేపు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ సమావేశం..

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఎల్లుండి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు. ఈ నెల 8వ తేదీన మధ్యాహ్నం 1 గంటలకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశమవుతారు. ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఈ సమావేశం జరగనుంది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు.   ఏం విగ్రహమంటూ కేటీఆర్ ఆగ్రహం   సచివాలయంలో ఏర్పాటు చేస్తోంది తెలంగాణ తల్లి విగ్రహమా? లేక కాంగ్రెస్ తల్లి విగ్రహమా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…

TELANGANA

తెలంగాణ తల్లికి కొత్త రూపం.. విగ్రహం ప్రత్యేకతలు ఇవే, ఈ నెల 9న ఆవిష్కరణ..

పచ్చచీర గట్టి, కంకి చేతబట్టి అభయహస్తంబు చూబుతూ పిడికిలి గురుతులున్న పాదపీఠంబెక్కి నిండు ముత్తయిదువోలె కనులపండువలా కనిపిస్తోంది తల్లీ తెలంగాణ. తల్లీ నీకివే మా పాదాభివందనాలంటూ.. అందరూ చేతులెత్తి మొక్కేలా ఉంది తెలంగాణ తల్లి విగ్రహం. సరికొత్త తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధం చేస్తోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.   తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను ప్రభుత్వం విడుదల చేసింది. సచివాలయంలో ఏర్పాటు చేస్తున్న తెలంగాణ…

AP

సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. ఫ్యూచర్ సిటీగా విశాఖ..

నాలెడ్జ్ ఎకానమీకి విశాఖపట్నం ఫ్యూచర్ సిటీగా మారుతోందన్నారు సీఎం చంద్రబాబు. ఉత్తమ నగరాలలో ఒకటిగా నిలుస్తుందన్నారు. టెక్నాలజీతో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, నాలెడ్జ్ ఎకానమీలో యువత కీలకంగా మారారని అన్నారు.   విశాఖపట్నంలో నేషనల్‌ డీప్‌ టెక్‌ ఇన్నోవేషన్ కాంక్లేవ్‌‌కు హాజరయ్యారు. సదస్సును ప్రారంభించిన అనంతరం మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రపంచంలో ఎటు చూసినా టెక్నాలజీపై చర్చ జరుగుతోందన్నారు. దీని కారణంగా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. జీవితంలో అది కూడా ఓ భాగంగా మారిందన్నారు.…

AP

ఏపీలో వారికి చుక్కలే.. రేషన్ అక్రమ రవాణాపై సిట్ ఏర్పాటు..

రేషన్ బియ్యం అక్రమ రవాణాన్ని అరికట్టేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల తరచూ రేషన్ బియ్యం అక్రమ రవాణా విషయం వార్తల్లో నిలుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బియ్యం అక్రమ దారులకు ఇక చుక్కలేనని చెప్పవచ్చు. కాకినాడ పోర్టును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనిఖీ చేసిన సమయంలో రేషన్ బియ్యం దేశాలకు దాటుతున్న విషయం వెలుగులోకి వచ్చింది.   దీనితో ఒక దశలో రేషన్ బియ్యం సరఫరాను నిలిపివేసి, లబ్దిదారులకు డబ్బులు…

AP

కాకినాడ పోర్టు ఇష్యూ..! ఈడీ రంగంలోకి దిగుతోందా..?

ఏపీలో రాజకీయాలు కాకినాడ పోర్టు చుట్టూనే తిరుగుతున్నాయా? పోర్టు వ్యవహారం వెలుగులోకి రాగానే సీఐడీ రంగంలోకి దిగేసిందా? నిందితులు దేశం విడిచి పారిపోకుండా లుకౌట్ నోటీసులు ఎందుకు జారీ చేసింది? ఈ వ్యవహారంలో వైసీపీ నుంచి వస్తున్న రియాక్షన్ ఏంటి? సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలని వైసీపీ ఎందుకు డిమాండ్ చేస్తోంది? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.   కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీ పాలనలో పట్టిన బూజును దులిపే ప్రయత్నం చేస్తున్నారు. తొలుత ముంబై…

TELANGANA

కోటి మంది మహిళాలను కోటీశ్వరులను చేస్తా.. సీఎం రేవంత్ రెడ్డి..

మహిళా సంక్షేమానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిచ్చి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని మాదాపూర్ లో గల శిల్పారామంలో నూతనంగా ఏర్పాటుచేసిన రాష్ట్రస్థాయి మహిళా శక్తి బజార్ ను సీఎం రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క, ఇతర మంత్రులు అధికారులు పాల్గొన్నారు.   ఇందిరా మహిళా శక్తి బజారు…

TELANGANA

ఇందిరమ్మ ఇళ్ల యాప్‌ ఆవిష్కరించిన సీఎం రేవంత్‌….

బీఆర్ఎస్‌ను ప్రజలు దూరం పెట్టినా ఆ పార్టీలో ఎలాంటి మార్పు రాలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మా ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లున్నారు. సభలో పాలకపక్షం- విపక్షం సమస్యలపై చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విపక్ష నేత సభకు రావడం లేదన్నారు.   సభకు వచ్చి పాలక పక్షాన్ని ఇరుకున పెట్టాలన్నారు సీఎం. మీ అనుభవాన్ని ప్రజల కోసం ఉపయోగించాలని సూచన చేశారు. ప్రభుత్వాన్ని అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నారా? అంటూ సున్నితంగా ప్రశ్నించారు. మీ పిల్లలిద్దర్నీ…

AP

ఏపీలో జ్యుడీషియల్ ప్రివ్యూ చట్టం రద్దు..

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జ్యుడీషియల్ ప్రివ్యూ చట్టంను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు.   టెండర్ల విధానంలో పారదర్శకత ఉండాలంటూ వైఎస్ జగన్ ప్రభుత్వం 2019లో ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (జ్యుడీషియల్ ప్రివ్యూ పారదర్శకత) చట్టాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని జ్యుడీషియల్ ప్రివ్యూ జడ్జిగా నాడు ప్రభుత్వం నియమించింది. వంద కోట్లు, అంతకంటే ఎక్కువ వ్యయం ఉన్న…

National

వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం ప్రకటన..

ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్య విధాన కమిటీ సమీక్ష సమావేశం ఇవాళ (శుక్రవారం) ముగిసింది. వరుసగా 11వ సారి కీలకమైన రెపో రేటును యథాతథంగా కొనసాగిస్తూ కమిటీ నిర్ణయించింది. 6.5 శాతంగా కొనసాగించేందుకు అనుకూలంగా ఆరుగురు సభ్యుల కమిటీ 4:2 మెజారిటీతో నిర్ణయం తీసుకుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. అధిక ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని తెలిపారు. ప్రతి రంగంలో ధరల స్థిరత్వం చాలా ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. కాగా మే…

AP

పిఠాపురంలో ‘పుష్ప 2’ పోస్టర్ల చించివేత..అల్లు అర్జున్‌కు అండగా నిలిచిన వైసీపీ..

ఏపీ రాజకీయాలు మొత్తం కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా చూట్టునే తిరుగుతున్నాయి. అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పకపోతే ‘పుష్ప-2’ సినిమాను ఆంధ్రప్రదేశ్‌లో అడ్డుకుంటామని జనసేన నేత చలమలశెట్టి రమేష్ బాబు హెచ్చరించారు. బీజేపీ సైతం ‘పుష్ప-2’ విమర్శలు గుప్పించింది. తాజాగా సినిమాపై బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి ఫైర్ అయ్యారు. సినిమాలో చూపించిందింతా కూడా ఫేక్ అని బీజేపీ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి తేల్చేశారు.  …