Editor

CINEMA

రవితేజ ‘మాస్ జాతర’ మొదలు..!

వరుసగా గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ తన ఎనర్జీని ప్రూవ్ చేస్తూ మాస్ మహారాజా రవితేజ దూసుకెళ్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు, ఈగెల్ సినిమాల తర్వాత మిస్టర్ బచ్చన్ సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించిన రవితేజకు ఆశించిన ఫలితం మాత్రం రాలేదు. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో మరో మాస్ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇందులో భాగంగానే భాను బోగవరపు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌కు “మాస్ జాతర” అనే పవర్‌ఫుల్ టైటిల్…

CINEMA

పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి సినిమాలో హీరోయిన్ ఫిక్స్..!

వరుస డిజాస్టర్లతో ఇబ్బంది పడుతున్న పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతితో ఒక సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని ఛార్మి కౌర్ నిర్మాతగా నిర్మించబోతున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి అనేక విషయాలు తెరమీదకి వస్తూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఈ సినిమాలో టబూ లేదా రవినా టాండన్, ఇద్దరిలో ఒకరు కీలక పాత్రలో నటించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే, ఎట్టకేలకు టబూ ఫిక్స్ అయింది.   ఆ విషయాన్ని ఈ రోజు…

TELANGANA

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం..! ఇకపై వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు..

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ తేదీకి ముందు రిజిస్ట్రరైన అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్లు ప్లేట్లు లేకపోతే బండి సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. నెంబర్ ప్లేట్ల కోసం www.siam.in వెబ్‌సైట్‌లో బుకింగ్‌ చేసుకోవాలని…

National

ముంబై ఉగ్రదాడి సూత్రధారి తహవ్వుర్ రాణాకు 18 రోజుల కస్టడీ..

ముంబై ఉగ్రదాడి కేసులో ప్రధాన సూత్రధారి తహవ్వుర్ రాణాకు ఎన్ఐఏ కోర్టు 18 రోజుల కస్టడీ విధించింది. రాణాను గత రాత్రి ఎన్ఐఏ అధికారులు ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు ప్రత్యేక జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఎన్ఐఏ తరపున సీనియర్ న్యాయవాది దయాన్ కృష్ణన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరేందర్ మాన్ వాదనలు వినిపించారు.   రాణా తరపున ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీ న్యాయవాది పీయూష్ సచ్‌దేవా వాదించారు. రాణాను తమకు 20 రోజుల కస్టడీకి ఇవ్వాల్సిందిగా…

National

తాలిబన్ల మరో వికృత చర్య.. జుట్టు అందంగా అలంకరించుకున్నా జైలుకే..!

ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్లు ఇప్పుడు పురుషులపైనా కత్తిగట్టారు. ఆధునిక పోకడలు పోయి జుట్టును అందంగా కత్తిరించుకుంటే ఇక ఊచలు లెక్కపెట్టుకోవాల్సిందే. జుట్టును అందంగా కత్తిరించుకున్న పురుషులతో పాటు, వారికి క్షవరం చేసిన క్షురకులను కూడా అరెస్ట్ చేస్తున్నారని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది.   కట్టుబాట్ల పేరుతో ఇప్పటి వరకు మహిళలపై అనేక ఆంక్షలు విధించిన తాలిబన్లు ఇప్పుడు పురుషులపైనా పడ్డారని ఐక్యరాజ్య సమితి ఆవేదన వ్యక్తం చేసింది. తాలిబన్ ప్రభుత్వంలోని ‘సదాచార, దురాచార నిరోధ మంత్రిత్వశాఖ’ చర్యల వల్ల…

National

అమెరికా రోడ్ల కంటే మన రోడ్లను అందంగా తీర్చిదిద్దుతాం: నితిన్ గడ్కరీ..

మన దేశంలోని రోడ్లను అమెరికా రహదారుల కంటే అందంగా తీర్చిదిద్దుతామని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. అమెరికా ధనిక దేశం కాబట్టి రోడ్లు బాగుంటాయని చాలా మంది అనుకుంటూ ఉంటారని… కానీ, రోడ్లు బాగున్నందుకే అమెరికా ధనిక దేశం అయిందని ఆ దేశ మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ ఒక సందర్భంలో అన్నారని చెప్పారు. దేశ అభివృద్ధిలో రహదారులు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. రోడ్లు బాగున్న…

AP

హోంవర్క్ చేయలేదని విద్యార్థులను చెప్పుతో కొట్టిన టీచర్..

శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. హోం వర్క్ చేయలేదని ముగ్గురు విద్యార్థులను ఓ ఉపాధ్యాయురాలు చెప్పుతో కొట్టారు. స్థానిక జీనియస్ పాఠశాలలో జరిగిందీ ఘటన. రెండో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు హోం వర్క్ చేయకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఉపాధ్యాయురాలు అనిత వారిని చెప్పుతో కొట్టారు. విషయం తెలిసిన బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని అనితను ప్రశ్నిస్తూ దాడి చేశారు.   విద్యార్థులను చెప్పుతో కొట్టడం ఏమిటని పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు. దీంతో…

TELANGANA

రేవంత్ రెడ్డి బుద్ధిహీనంగా కంచ గచ్చిబౌలి అడవిని ధ్వంసం చేస్తున్నారు: కేటీఆర్..

కంచ గచ్చిబౌలిలోని చిట్టడవిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత నిర్దయగా ధ్వంసం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. దీనివల్ల విలువైన వృక్ష, జంతుజాలం నష్టపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్‌సీయూ అడవులను ధ్వంసం చేయడంతో ఓ జింక ప్రాణాలు కోల్పోయిందని, ఆ రక్తపు మరకలు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేతికి అంటాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.   వన్యప్రాణుల ఈ దారుణ హత్యపై సుప్రీంకోర్టు దృష్టి సారించాలని తాను కోరుతున్నానని…

National

వక్ఫ్ సవరణ బిల్లు-2025పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్, మజ్లిస్..

వక్ఫ్ (సవరణ) బిల్లు-2025ను సవాల్ చేస్తూ కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. పార్లమెంటు ఉభయ సభల్లో వక్ఫ్ (సవరణ) బిల్లు-2025 ఆమోదం పొందిన విషయం విదితమే.   ఈ బిల్లును కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావేద్, మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ బిల్లు (సవరణ) లోని నిబంధనలు ముస్లిం సమాజం యొక్క ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే విధంగా ఉన్నాయని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు.   కేంద్ర ప్రభుత్వం…

TELANGANA

జీవన ప్రమాణాలు పెంచే విధంగా మన విద్యా విధానం ఉండాలి: రేవంత్ రెడ్డి..

జీవన ప్రమాణాలు పెంపొందించే విధంగా విద్యా విధానం ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఉత్తమ విద్యా వ్యవస్థ కోసం ఒక పాలసీని రూపొందించాలని విద్యాశాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. విద్యా కమిషన్, విద్యాశాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు.   క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా, ఆచరణ సాధ్యమయ్యేలా పాలసీ ఉండాలని ఆయన అన్నారు. జీవన ప్రమాణాలు పెంచే విధంగా విద్యావిధానం ఉండాలని అధికారులకు సూచించారు. భాషతో పాటు, విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానం పెంచేలా ఈ…