Editor

National

ఎయిరిండియా విమాన ప్రమాదం… మృతుల కుటుంబాలకు భారీ పరిహారం ప్రకటించిన టాటా గ్రూప్..

అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఎయిరిండియా యాజమాన్య సంస్థ టాటా గ్రూప్ అండగా నిలిచింది. ఈ దుర్ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన టాటా గ్రూప్, మృతుల కుటుంబాలకు భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ప్రతి కుటుంబానికి కోటి రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా, ఈ ప్రమాదంలో గాయపడిన వారి వైద్య ఖర్చులన్నింటినీ తామే భరిస్తామని స్పష్టం చేసింది.   ఈ మేరకు టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.…

TELANGANA

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్య.. తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల్లోనూ ఇకపై ప్రీ ప్రైమరీ విద్యను అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతుల నిర్వహణకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.   ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచే ప్రవేశాలు కల్పిస్తున్నారు. అయితే, ప్రైవేటు పాఠశాలల్లో మాత్రం మూడేళ్ల వయసు నుంచే నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ వంటి ప్రీ…

National

అమరావతి మహిళలపై వ్యాఖ్యలు.. జర్నలిస్టు కృష్ణంరాజు అరెస్ట్..

రాజధాని అమరావతి మహిళలను కించపరిచేలా తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణంరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన నేపథ్యంలో, అసభ్యకర వ్యాఖ్యల కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న కృష్ణంరాజును భీమిలి గోస్తనీనది సమీపంలో సెల్‌ టవర్‌ లోకేషన్‌ ఆధారంగా తుళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన్ను విచారణ నిమిత్తం మంగళగిరికి తరలిస్తున్నట్లు సమాచారం.   వైసీపీ అనుబంధ సాక్షి టీవీలో ప్రసారమైన ఓ చర్చా కార్యక్రమంలో జర్నలిస్టు…

TELANGANA

కొత్త మంత్రులు వివేక్, లక్ష్మణ్, శ్రీహరికి శాఖలు ఖరారు చేసిన సీఎం రేవంత్..

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు నూతన మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం శాఖలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.   కేటాయించిన శాఖల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అడ్లూరి లక్ష్మణ్‌కు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల బాధ్యతలు అప్పగించారు. గడ్డం వివేక్‌కు కార్మిక శాఖతో పాటు గనులు, భూగర్భ వనరుల శాఖలను కేటాయించారు. వాకిటి శ్రీహరికి క్రీడలు, యువజన సర్వీసులు, పశుసంవర్ధక శాఖల బాధ్యతలను ముఖ్యమంత్రి అప్పగించారు.…

AP

అమరావతి మహిళలపై వ్యాఖ్యలు.. జర్నలిస్టు కృష్ణంరాజు అరెస్ట్..

రాజధాని అమరావతి మహిళలను కించపరిచేలా తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణంరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన నేపథ్యంలో, అసభ్యకర వ్యాఖ్యల కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న కృష్ణంరాజును భీమిలి గోస్తనీనది సమీపంలో సెల్‌ టవర్‌ లోకేషన్‌ ఆధారంగా తుళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన్ను విచారణ నిమిత్తం మంగళగిరికి తరలిస్తున్నట్లు సమాచారం.   వైసీపీ అనుబంధ సాక్షి టీవీలో ప్రసారమైన ఓ చర్చా కార్యక్రమంలో జర్నలిస్టు…

AP

కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో రామ్మోహన్ నాయుడు భేటీ .. మూడు ప్రధాన సమస్యలపై వినతి..

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నిన్న సమావేశమయ్యారు. రాష్ట్ర రైతుల సమస్యలపై చర్చించేందుకు ఆయన ప్రత్యేకంగా అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. ప్రధానంగా మూడు అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది.   2014-19 సంవత్సరాల మధ్య ఉపాధి పథకం కింద రాష్ట్రానికి చెల్లించాల్సిన బకాయిల సమస్యను త్వరితగతిన పరిష్కరించి నిధులు విడుదల చేయాలని రామ్మోహన్ నాయుడు కోరారు. దేశంలోనే అత్యధిక పామాయిల్ ఉత్పత్తి చేసే…

AP

ఫ్యాక్టరీస్ యాప్ ను ప్రారంభించిన ఏపీ కార్మిక మంత్రి వాసంశెట్టి..

పారిశ్రామిక అభివృద్ధి ఎంత ముఖ్యమో కార్మిక భద్రత అంతే ముఖ్యమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. కార్మిక భద్రతా ప్రమాణాలను ముందుకు తీసుకెళ్లేందుకు, బీఐఎస్ విజయవాడ శాఖ ఆధ్వర్యంలో సామర్థ్యాభివృద్ధి కార్యక్రమం మరియు గట్టి భద్రతా ఆడిట్ శిక్షణ (IS 14489:2018 ప్రకారం)’ కార్యక్రమాన్ని నిన్న విజయవాడలోని హయత్ ప్లేస్ హోటల్‌లో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి సుభాష్, కర్మాగార శాఖ ఏపీసీఎఫ్ఎస్ఎస్ సహకారంతో రూపొందించిన ‘factories’ యాప్‌ను ప్రారంభించారు.…

TELANGANA

మిల్లెట్స్ హబ్‌గా హైదరాబాద్.. గ్లోబల్ సెంటర్‌కు కేంద్ర మంత్రి శంకుస్థాపన..

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ సోమవారం హైదరాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్ – భారత సిరిధాన్యాల పరిశోధన సంస్థ (ఐఐఎంఆర్) ప్రాంగణంలో ‘గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ మిల్లెట్స్’కు ఆయన శంకుస్థాపన చేశారు.   సిరిధాన్యాల రంగంలో పరిశోధన, అభివృద్ధి, శిక్షణతో పాటు వాటి ప్రాచుర్యం కల్పించే దిశగా ఈ కేంద్రం ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని శివరాజ్‌సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మిల్లెట్ల ప్రాముఖ్యతను మరింతగా పెంపొందించేందుకు ఈ…

AP

భవిష్యత్ టెక్నాలజీలకు కేంద్రంగా అమరావతి..!

అమరావతిలో పెద్ద ప్రాజెక్ట్ మొదలైంది. దీనితో మూడు నగరాలకు ఊహించని కనెక్టివిటీ పెరగనుంది. అంతేకాదు ఇక్కడ ఎందరో విద్యార్థులకు మేలు చేకూరనుంది. ఆ ప్రాజెక్ట్ గురించి తెలుసుకుంటే చాలు, జై అమరావతి.. జైజై రాజధాని అనేస్తారు. ఇంతకు ఆ ప్రాజెక్ట్ ఏమిటో తెలుసుకోండి. మన రాజధాని అద్భుతాన్ని తెలుసుకొని, రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షిద్దాం.   రాష్ట్ర రాజధాని అమరావతిని ఇప్పుడు దేశానికి గర్వకారణంగా మార్చే పనిని ఏపీ కూటమి ప్రభుత్వం మొదలుపెట్టింది. ఇప్పటి వరకు నిర్మాణం ఆగిపోయిందని…

National

సింధు జలాల ఒప్పందం నిలిపివేతతో.. నీటి సంక్షోభంతో పాక్ విలవిలా..!

పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ తీసుకున్న కఠిన నిర్ణయంతో పాకిస్థాన్ తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంతో, ఇప్పటికే నీటి కొరతతో అల్లాడుతున్న పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు సింధు నదీ వ్యవస్థ నుంచి అందే నీటిలో భారీగా కోత పడింది. జూన్ 5న సింధు బేసిన్ నుంచి పాక్ డ్యామ్‌లకు 1,24,500 క్యూసెక్కుల నీరు మాత్రమే విడుదలైందని, గత ఏడాది ఇదే సమయానికి ఇది సుమారు 1,44,000 క్యూసెక్కులుగా…