Editor

TELANGANA

‘కాళేశ్వరం’ మరో దేశంలో నిర్మించి ఉంటే చరిత్రలో నిలచిపోయేది: కేటీఆర్..

కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశమైంది. ఈ ప్రాజెక్టు ప్రయోజనాలు ప్రజలకు తెలుసని, కేవలం కేసీఆర్‌ను అప్రతిష్ఠపాలు చేయడమే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పనిచేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కాళేశ్వరం అంశంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఎదుట సోమవారం మాజీ మంత్రి హరీశ్‌రావు విచారణకు హాజరయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టుపై తమ ప్రభుత్వ వైఖరిని, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు…

AP

బుద్ధి మార్చుకోని జర్నలిస్ట్ కృష్ణంరాజు.. ఆధారాలున్నాయంటూ తన వ్యాఖ్యలను సమర్థించుకునే యత్నం..

సాధారణంగా ఎవరైనా తప్పు చేస్తే, ఆ తర్వాతైనా పశ్చాత్తాపం వ్యక్తం చేస్తారు. కానీ, అమరావతి మహిళలను ఉద్దేశించి గతంలో సాక్షి చానెల్‌లో తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ కృష్ణంరాజు మాత్రం తన తీరు మార్చుకోవడం లేదు. పైగా, తన వ్యాఖ్యలను సమర్థించుకునేందుకు మరింత వివాదాస్పద చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా, ఆయన తన వ్యాఖ్యలకు ఆధారాలు ఇవిగోనంటూ కొన్ని పాత వార్తా కథనాలను చూపిస్తూ ఒక వీడియోను విడుదల చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.   గతంలో…

National

హనీమూన్ ట్రిప్ ఓ కుట్ర.. కోడలే హంతకురాలు.. రాజా రఘువంశీ తల్లి సంచలన ఆరోపణలు..

హనీమూన్ కోసం ఇండోర్ నుంచి మేఘాలయ వెళ్లి అక్కడ హత్యకు గురైన రాజా రఘువంశీ కేసులో ఆయన తల్లి ఉమా రఘువంశీ సంచలన ఆరోపణలు చేశారు. ఈ హత్య వెనుక తన కోడలు సోనమ్ హస్తం ఉందని, ఆమె కిరాయి హంతకులతో తన కుమారుడిని చంపించిందని ఆరోపించారు. ఒకవేళ తన కోడలు దోషిగా తేలితే, ఆమెకు మరణశిక్ష విధించాలని ఆమె డిమాండ్ చేశారు.   ఇటీవల వివాహం చేసుకున్న రాజా రఘువంశీ, తన భార్య సోనమ్‌తో కలిసి…

National

అదానీ పోర్టుకు ప్రపంచంలోనే అతిపెద్ద కంటైనర్ నౌక..

భారత సముద్ర వాణిజ్య రంగంలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద కంటైనర్ నౌక ‘ఎంఎస్‌సీ ఇరినా’ ఈ రోజు అదానీ గ్రూప్ నిర్వహిస్తున్న కేరళలోని విళింజం అంతర్జాతీయ ఓడరేవుకు చేరుకుంది. ఈ భారీ నౌక మంగళవారం వరకు ఇక్కడే ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ పరిణామం అత్యంత భారీ కంటైనర్ నౌకలను (అల్ట్రా-లార్జ్ కంటైనర్ వెసెల్స్ – యూఎల్‌సీవీ) నిర్వహించడంలో విళింజం పోర్టుకున్న అపార సామర్థ్యాన్ని స్పష్టం చేస్తోంది.   ప్రపంచంలోనే అత్యధిక టీఈయూ…

TELANGANA

సొంత పార్టీ నేతలే టార్గెట్ చేస్తున్న రాజాసింగ్..! మరోసారి..

సొంత పార్టీ నాయకుడినే లక్ష్యంగా చేసుకుని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి విమర్శలు గుప్పించారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలో మరోసారి పరోక్షంగా కిషన్ రెడ్డిపై ఆయన విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది.   హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..…

TELANGANA

మంత్రి పదవి దక్కకపోవడంపై… మల్ రెడ్డి ఏమంటున్నారంటే…!

తెలంగాణలో నిన్న మంత్రివర్గ విస్తరణ జరిగింది. అనేక మంది మంత్రి పదవుల కోసం ప్రయత్నించినప్పటికీ, ముగ్గురికే అవకాశం లభించింది. సీనియర్లను కాదని తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన అడ్డూరి లక్ష్మణ్, వాకాటి శ్రీహరికి, గతంలో ఎంపీగా పనిచేసిన వివేక్ వెంకటస్వామికి మంత్రివర్గంలో స్థానం కల్పించారు.   ఈ నేపథ్యంలో మంత్రి పదవి ఆశించి భంగపడిన నాయకులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి పదవి ఆశించిన సీనియర్ నేత, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిని పార్టీ…

AP

అమరావతిని వేశ్యల రాజధాని అన్న జర్నలిస్ట్ కృష్ణంరాజు… రాష్ట్రంలో భగ్గుమన్న నిరసనలు..

అమరావతి మహిళలను కించపరిచేలా ‘సాక్షి’ టీవీ ఛానెల్‌లో ప్రసారమైన చర్చా కార్యక్రమంలో జర్నలిస్టు వీవీఆర్ కృష్ణంరాజు చేసిన తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా పెను దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలు, వాటిని సమర్థించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘సాక్షి’ ప్రతినిధి కొమ్మినేని శ్రీనివాసరావుపై నిన్న అన్ని జిల్లాల్లోనూ తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. రైతులు, మహిళలు, వివిధ ప్రజా సంఘాలు ఆందోళనలు నిర్వహించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.   రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఫిర్యాదులు నిన్న రాష్ట్రంలోని…

NationalTechnology

ఇక ఉబెర్ హెలికాప్టర్ సేవలు..! ఎప్పుడు..? ఎక్కడంటే..?

టాక్సీ సేవలందించే ప్రముఖ యాప్ ఉబెర్ లో సరికొత్త సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటి వరకు కార్, ఆటో, బైక్ మాత్రమే బుక్ చేసుకునే అవకాశం ఉండగా.. తాజాగా హెలికాప్టర్ బుకింగ్ సర్వీసును కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. అయితే, ఈ సర్వీస్ కేవలం ఇటలీలో మాత్రమే అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపింది. ఇటీవలి కాలంలో పర్యాటకుల రద్దీ పెరగడంతో ఇటలీలోని అమాల్ఫీ తీరంలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది.   కొద్ది దూరం ప్రయాణించాలన్నా చాలా సమయం…

AP

మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిపై మరో కేసు నమోదు..!

అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైకాపా నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తులూరు పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదు చేశారు.   వైకాపా ప్రభుత్వ హయాంలో ముత్తుకూరు మండల పరిధిలో కృష్ణపట్నం పోర్టుకు వెళ్లే మార్గంలోని ప్రధాన రహదారిపై అక్రమంగా టోల్ గేట్ ఏర్పాటు చేసి కంటెయినర్ల నుంచి డబ్బులు వసూళ్లకు పాల్పడ్డారని…

AP

అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు..! యాంకర్ కొమ్మినేని అరెస్టు..

అమరావతి మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లోని జర్నలిస్ట్ కాలనీలో ఆయన నివాసానికి వెళ్లి అరెస్టు చేశారు. కొమ్మినేనిని ఆంధ్రప్రదేశ్ కు తరలిస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతిపై సాక్షి టీవీ చర్చలో మహిళలను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ కొమ్మినేనిపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో కొమ్మినేనిపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో…