మాజీ మంత్రి విడదల రజనికి చేదు అనుభవం..! ఏం జరిగిందంటే..?
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పల్నాడులో ముస్లింలు చేపట్టిన ర్యాలీకి హాజరైన మాజీ మంత్రి విడదల రజనికి చేదు అనుభవం ఎదురైంది. తమ ర్యాలీని రాజకీయం చేయొద్దని, అక్కడి నుంచి వెళ్లిపోవాలని ముస్లింలు కోరడంతో చేసేదేమీ లేక రజని వెనుదిరిగారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ ముస్లింలు ర్యాలీ చేపట్టారు. ముస్లింలకు సంఘీభావం తెలుపుతూ మాజీ మంత్రి రజని…

