నైనీ కోల్ బ్లాక్ వివాదం: సింగరేణి టెండర్ల చుట్టూ ముసురుతున్న రాజకీయ ముఠా!
ఒడిశా రాష్ట్రంలోని అంగుల్ జిల్లాలో సింగరేణి సంస్థకు కేటాయించిన నైనీ బొగ్గు గని ప్రస్తుతం పెద్ద వివాదానికి దారితీసింది. సింగరేణి తన విస్తరణలో భాగంగా ఈ బ్లాక్ను దక్కించుకున్నప్పటికీ, అక్కడ తవ్వకాలు జరిపేందుకు పిలిచిన టెండర్లలోని ‘క్లాజ్ 1.8’ నిబంధన చిచ్చు రేపింది. ఈ నిబంధన ప్రకారం, టెండర్ వేసే కంపెనీలు గని ప్రాంతాన్ని సందర్శించి సింగరేణి జనరల్ మేనేజర్ (GM) నుండి ‘సైట్ విజిట్ సర్టిఫికేట్’ పొందాలి. అయితే, అధికారులు కావాలనే కొన్ని నిర్దిష్ట కంపెనీలకు…

