ఎస్ఎల్‌బీసీ సొరంగంలో డేంజర్ జోన్‌లో వ్యర్థాల తొలగింపు కోసం ప్రయత్నాలు..!
ఎస్ఎల్‌బీసీ సొరంగం డేంజర్ జోన్‌కు సమీపంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సొరంగంలో రెండు నెలలుగా సహాయక చర్యలు కొనసాగుతుండగా, డేంజర్ జోన్‌లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై అధికారులు, సహాయక సిబ్బంది నిరంతరం చర్చిస్తున్నారు. సొరంగం మార్గంలో 281 మీటర్ల మేర పేరుకుపోయిన మట్టి, రాళ్లతో పాటు ప్రమాద సమయంలో ధ్వంసమైన టన్నెల్ బోరింగ్ యంత్ర భాగాలను ఇదివరకే వెలికి తీశారు. అక్కడి నుంచి మరో 43 మీటర్లను డేంజర్ జోన్‌గా గుర్తించారు.…

